నిర్మల్ జిల్లా బ్రేకింగ్ న్యూస్
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, ఎండలు మారుతూ ఉన్నప్పటికీ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉదయాన్నే గ్రౌండ్లలో వాకింగ్ చేయడానికి హాజరవుతున్నారు.
బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న పలువురు వ్యక్తులు వైద్యుల సూచన మేరకు నిత్యం వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. వర్షం పడుతున్నా, ఎండ మండుతున్నా వాకింగ్‌ను ఆపకుండా కొనసాగించడం గమనార్హం.
“ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నినాదాన్ని నమ్మిన ప్రజలు క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చేస్తూ ఇతరులకు కూడా ప్రేరణనిస్తున్నారు. ప్రజలు చెబుతున్నట్లుగా, చిన్న వ్యాధులను జయించడానికి క్రమమైన నడక, ఆహారపు అలవాట్లు, సానుకూల ఆలోచనలే ప్రధాన ఆయుధమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


