Tuesday, 24 March 2026
  • Home  
  • శివ భక్తురాలు
- పిల్లలకు

శివ భక్తురాలు

అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది. తన పేరు మహేశ్వరి మహేశ్వరి ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. తను పుట్టినప్పుడు తన నోటి నుండి మొదటగా పలికిన మాట “శివ శివ”అంటూ పలికింది.అందువలన తనకు మహేశ్వరి అని శివుని పేరును పెట్టారు వారి తల్లిదండ్రులు. మహేశ్వరి పెద్దయీ, తను చదువును ఊరిలో ఉన్న ఒక పాఠశాలలో చదువుతుంది. మహేశ్వరి రోజు ఉదయం తొందరగా లేచి వాళ్ళ ఊరిలో ఉన్న శివుని గుడికి వెళుతూ ఉండేది. రోజు శివునికి అభిషేకం చేసి నైవేద్యంగా ఫలాలు లేదంటే తన అమ్మని అడిగి ప్రసాదం చేయించుకుని తీసుకు వెళుతుంది. రోజు శివలింగానికి పూజలు చేసేది. ఒక రోజు తన తల్లికి ఒక పాపా లేదా ఒక బాబు పుడతాడని వారి నాన్న మహేశ్వరి తో చెప్పాడు, అప్పుడు మహేశ్వరి శివుని దగ్గరకు వెళ్లి చాలా ఆనందంగా శివా నాకు ఒక చెల్లెలు లేదా ఒక తమ్ముడు రాబోతున్నాడు నాకు సంతోషంగా ఉంది అని శివునితో చెప్పుకుంటుంది. తరువాత కొన్ని రోజులకు తన తల్లికి బిడ్డ పుట్టే క్రమంలో తన తల్లి మరణించి ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి బాధతో శివుని దగ్గరకు వెళ్లి”ఓ శివ!ఎందుకు ఇలా చేశావు నా తల్లిని ఎందుకు నాకు దూరం చేశావు,ఎప్పుడైన తమ్ముడు అమ్మ ఏది అక్క అని అడిగితే నేను ఏం చెప్పను” అని శివుడిని ప్రశ్నించింది మహేశ్వరి. కొన్ని నెలల తర్వాత వాళ్ల తమ్ముడికి శివా అని నామకరణం చేశారు.తరువాత పాఠశాలకు తన అక్కతో వెళ్లడం ప్రారంభించాడు.తన తండ్రి పని కోసం పట్నం వెళ్లి తన పిల్లలను వాళ్ళ అమ్మ దగ్గర ఉంచి వెళ్ళాడు. శివ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చాక తన అక్కని ఏడుస్తూ ఇలా అడిగాడు “అక్క అమ్మ ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తుంది నా స్నేహితుడిని తన తల్లి పాఠశాలకు తీసుకువచ్చింది అప్పుడు వారు నన్ను మీ అమ్మ ఎక్కడ ఉంది అని నన్ను అడిగారు” అని ఏడుస్తూ తన అక్కతో చెప్పాడు.అప్పుడు మహేశ్వరి తన తమ్ముడిని తీసుకొని శివుని గుడి దగ్గరకు తీసుకువెళ్ళింది తన తమ్ముడు శివకి మహేశ్వరి ఇలా చెప్పింది “మనకు అమ్మ అయినా నాన్న అయినా అన్ని శివుడే” అని చెప్పింది.అప్పుడు తన తమ్ముడు “ఎందుకు అక్క తనే మనకు అమ్మానాన్న “అని అడిగాడు. అప్పుడు తన అక్క మహేశ్వరి ఇలా చెప్పింది “తమ్ముడు నేను చిన్నప్పటి నుండి నా ప్రతి ఆనందాన్ని బాధను శివునితోనే చెప్పుకున్నాను, నా ప్రతి సమయంలోను తోడున్నాడు,శివుడు ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళడు” అని చెప్పింది.అప్పుడు తన తమ్ముడు శివ రోజు తన అక్కతో గుడికి వచ్చి శివునికి పూజ చేసి నైవేద్యం సమర్పించి, పాఠశాలకు వెళ్లేవారు.అలా ఇద్దరు పెద్దయి మహేశ్వరి ఇంటర్ పూర్తయింది. తన తమ్ముడి శివ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. వారి తండ్రి పట్నం నుండి మహేశ్వరి చదువుకు కావాల్సినంత డబ్బును పంపాడు.పై చదువులు చదవడం కోసం మహేశ్వరి పట్నం వెళ్లి, హాస్టల్లో ఉండి, తన తమ్ముడికి ఉత్తరాలు రాసేది. తన తమ్ముడు శివ ఊరిలోని గవర్నమెంట్ పాఠశాలలో తన నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాడు. మహేశ్వరి తన చదువును పూర్తి చేసుకుని,మంచి ఉద్యోగం తెచ్చుకుని,తన ఊరికి వచ్చి, తన ఇంటికి వెళ్లి,తన తమ్ముడు శివను గుడికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ భక్తిశ్రద్ధలతో గుడికి వెళ్లి, శివుని దగ్గర తనకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషాన్ని గురించి శివునికి చెప్పుకుంది.మహేశ్వరి ఇలా ప్రతి విషయం తను శివునితో చెప్తూ తన తమ్ముడికి తల్లి లేని లోటు తీర్చింది. మహేశ్వరి శివల అపరమైన భక్తికి శివుడు ప్రసన్నమై ఒకరోజు మహేశ్వరికి తన తమ్ముడు శివకు శివుడు కలలో వచ్చి” ఓ మహేశ్వరి నీ ప్రతి సుఖదుఃఖాలను నువ్వు నాతో చెప్పుకున్నావు,అలాగే నువ్వు రోజు నాకు నిష్టగా పూజలు చేసి నీ తమ్ముడిని కూడా నా దగ్గరకు తీసుకువచ్చి తనకు తల్లి లేని లోటును తీర్చావు, నీకు ఏమి కోరిక కావాలో చెప్పు నేను తీరుస్తాను” అని శివుడు చెప్పాడు.అప్పుడు మహేశ్వరి శివునితో ఇలా చెప్పింది “నాకు, నా తమ్ముడికి నువ్వు ప్రతి సమయంలోనూ , మా ప్రతి ఉనికిలో, ప్రతి చోటు నువ్వే మాకు కనిపించాలి, నువ్వే మాకు సర్వస్వంగా,మా దగ్గర ఉండాలి” అని చెప్పింది. తర్వాత తెల్లవారి తొందరగా నిద్ర లేచి మహేశ్వరి తన తమ్ముడడు శివ గుడికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసి,పూజలు చేసి,నైవేద్యం సమర్పించారు. శివుడు తనకు ప్రతి సమయంలోనూ తోడుంటాడనే నమ్మకం మహేశ్వరి చాలా బలంగా నమ్మి తన నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోనని శివునికి చెప్పింది.ఇలా మహేశ్వరి శివునికి ఒక ప్రియమైన భక్తురాలిగా శివుని మనసులో నిలిచిపోయింది.

అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది. తన పేరు మహేశ్వరి మహేశ్వరి ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. తను పుట్టినప్పుడు తన నోటి నుండి మొదటగా పలికిన మాట “శివ శివ”అంటూ పలికింది.అందువలన తనకు మహేశ్వరి అని శివుని పేరును పెట్టారు వారి తల్లిదండ్రులు. మహేశ్వరి పెద్దయీ, తను చదువును ఊరిలో ఉన్న ఒక పాఠశాలలో చదువుతుంది. మహేశ్వరి రోజు ఉదయం తొందరగా లేచి వాళ్ళ ఊరిలో ఉన్న శివుని గుడికి వెళుతూ ఉండేది. రోజు శివునికి అభిషేకం చేసి నైవేద్యంగా ఫలాలు లేదంటే తన అమ్మని అడిగి ప్రసాదం చేయించుకుని తీసుకు వెళుతుంది. రోజు శివలింగానికి పూజలు చేసేది. ఒక రోజు తన తల్లికి ఒక పాపా లేదా ఒక బాబు పుడతాడని వారి నాన్న మహేశ్వరి తో చెప్పాడు,
అప్పుడు మహేశ్వరి శివుని దగ్గరకు వెళ్లి చాలా ఆనందంగా శివా నాకు ఒక చెల్లెలు లేదా ఒక తమ్ముడు రాబోతున్నాడు నాకు సంతోషంగా ఉంది అని శివునితో చెప్పుకుంటుంది. తరువాత కొన్ని రోజులకు తన తల్లికి బిడ్డ పుట్టే క్రమంలో తన తల్లి మరణించి ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి బాధతో శివుని దగ్గరకు వెళ్లి”ఓ శివ!ఎందుకు ఇలా చేశావు నా తల్లిని ఎందుకు నాకు దూరం చేశావు,ఎప్పుడైన తమ్ముడు అమ్మ ఏది అక్క అని అడిగితే నేను ఏం చెప్పను” అని శివుడిని ప్రశ్నించింది మహేశ్వరి. కొన్ని నెలల తర్వాత వాళ్ల తమ్ముడికి శివా అని నామకరణం చేశారు.తరువాత పాఠశాలకు తన అక్కతో వెళ్లడం ప్రారంభించాడు.తన తండ్రి పని కోసం పట్నం వెళ్లి తన పిల్లలను వాళ్ళ అమ్మ దగ్గర ఉంచి వెళ్ళాడు. శివ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చాక తన అక్కని ఏడుస్తూ ఇలా అడిగాడు “అక్క అమ్మ ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తుంది నా స్నేహితుడిని తన తల్లి పాఠశాలకు తీసుకువచ్చింది అప్పుడు వారు నన్ను మీ అమ్మ ఎక్కడ ఉంది అని నన్ను అడిగారు” అని ఏడుస్తూ తన అక్కతో చెప్పాడు.అప్పుడు మహేశ్వరి తన తమ్ముడిని తీసుకొని శివుని గుడి దగ్గరకు తీసుకువెళ్ళింది తన తమ్ముడు శివకి మహేశ్వరి ఇలా చెప్పింది “మనకు అమ్మ అయినా నాన్న అయినా అన్ని శివుడే” అని చెప్పింది.అప్పుడు తన తమ్ముడు “ఎందుకు అక్క తనే మనకు అమ్మానాన్న “అని అడిగాడు. అప్పుడు తన అక్క మహేశ్వరి ఇలా చెప్పింది “తమ్ముడు నేను చిన్నప్పటి నుండి నా ప్రతి ఆనందాన్ని బాధను శివునితోనే చెప్పుకున్నాను, నా ప్రతి సమయంలోను తోడున్నాడు,శివుడు ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళడు” అని చెప్పింది.అప్పుడు తన తమ్ముడు శివ రోజు తన అక్కతో గుడికి వచ్చి శివునికి పూజ చేసి నైవేద్యం సమర్పించి, పాఠశాలకు వెళ్లేవారు.అలా ఇద్దరు పెద్దయి మహేశ్వరి ఇంటర్ పూర్తయింది. తన తమ్ముడి శివ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. వారి తండ్రి పట్నం నుండి మహేశ్వరి చదువుకు కావాల్సినంత డబ్బును పంపాడు.పై చదువులు చదవడం కోసం మహేశ్వరి పట్నం వెళ్లి, హాస్టల్లో ఉండి, తన తమ్ముడికి ఉత్తరాలు రాసేది. తన తమ్ముడు శివ ఊరిలోని గవర్నమెంట్ పాఠశాలలో తన నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాడు. మహేశ్వరి తన చదువును పూర్తి చేసుకుని,మంచి ఉద్యోగం తెచ్చుకుని,తన ఊరికి వచ్చి, తన ఇంటికి వెళ్లి,తన తమ్ముడు శివను గుడికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ భక్తిశ్రద్ధలతో గుడికి వెళ్లి, శివుని దగ్గర తనకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషాన్ని గురించి శివునికి చెప్పుకుంది.మహేశ్వరి ఇలా ప్రతి విషయం తను శివునితో చెప్తూ తన తమ్ముడికి తల్లి లేని లోటు తీర్చింది. మహేశ్వరి శివల అపరమైన భక్తికి శివుడు ప్రసన్నమై ఒకరోజు మహేశ్వరికి తన తమ్ముడు శివకు శివుడు కలలో వచ్చి” ఓ మహేశ్వరి నీ ప్రతి సుఖదుఃఖాలను నువ్వు నాతో చెప్పుకున్నావు,అలాగే నువ్వు రోజు నాకు నిష్టగా పూజలు చేసి నీ తమ్ముడిని కూడా నా దగ్గరకు తీసుకువచ్చి తనకు తల్లి లేని లోటును తీర్చావు, నీకు ఏమి కోరిక కావాలో చెప్పు నేను తీరుస్తాను” అని శివుడు చెప్పాడు.అప్పుడు మహేశ్వరి శివునితో ఇలా చెప్పింది “నాకు, నా తమ్ముడికి నువ్వు ప్రతి సమయంలోనూ , మా ప్రతి ఉనికిలో, ప్రతి చోటు నువ్వే మాకు కనిపించాలి, నువ్వే మాకు సర్వస్వంగా,మా దగ్గర ఉండాలి” అని చెప్పింది. తర్వాత తెల్లవారి తొందరగా నిద్ర లేచి మహేశ్వరి తన తమ్ముడడు శివ గుడికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసి,పూజలు చేసి,నైవేద్యం సమర్పించారు. శివుడు తనకు ప్రతి సమయంలోనూ తోడుంటాడనే నమ్మకం మహేశ్వరి చాలా బలంగా నమ్మి తన నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోనని శివునికి చెప్పింది.ఇలా మహేశ్వరి శివునికి ఒక ప్రియమైన భక్తురాలిగా శివుని మనసులో నిలిచిపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.