సీతారామపురం ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
వైసిపి అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి దంపతులకు 29 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను సీతారామపురం వైసిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి సతీమణి సీతారామపురం మండల అధ్యక్షురాలు చింతం రెడ్డి పద్మావతి దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సుపరిపాలన తరాలు మారినా నిలిచి ఉంటుందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి పట్టం కట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.


