సీతారామపురం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ ఐదు జిల్లాల జోనల్ ఆత్మీయ సమావేశం తిరుపతిలోని డీపీఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున పిలుపుమేరకు సీతారామపురం మండలానికి చెందిన నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ సంయుక్త కార్యదర్శి పాలగిరి ముద్దుకృష్ణమరాజు ఆధ్వర్యంలో యువత పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లో యువత పాత్ర ముఖ్యమైనదని ప్రతి ఒక్కరూ పట్టుదలతో వైయస్ జగన్మోహన్ రెడ్డిని 2029లో ముఖ్యమంత్రిగా చేసుకునేలా పనిచేయాలన్నారు. రాబోయే జగనన్న 2.0 ప్రభుత్వంలో యువతకు ప్రాముఖ్యతను కల్పిస్తూ జగనన్న పాలన ఉంటుందని కావున యువత మరింత ఉత్సాహంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని రాష్ట్ర నాయకులు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం వైసిపి యువ నాయకులు సరస్వతి నారాయణ రాజు, ఓంకారం పవన్, షేక్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.


