సీతారామపురం జనవరి(పున్నమి ప్రతినిధి)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల రెడ్డి ని శనివారం హైదరాబాదులోని ఆమె నివాసంలో సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి యువ నాయకుడు పాలగిరి ముద్దుకృష్ణమరాజు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైసిపి నేత శ్యామల కు బొకే ఇచ్చి స్వీట్ బాక్స్ ను అందించారు. అనంతరం సీతారామపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్యామలను కోరినట్లు ఆయన తెలిపారు. రాబోయే 2029 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అహర్నిశలు పనిచేసి గ్రామస్థాయి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి వైసిపి జెండా ఎగురవేసేలా పనిచేయాలని, ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని శ్యామల రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం మండల వైసిపి యువ నాయకుడు కప్ప సురేంద్ర రాజు,వెంగయ్య తదితరులు పాల్గొన్నారు.


