రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 30:
గుమ్మా్రేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ను మాజీ ఎమ్ ఎల్ సి ఆగులూరి లక్ష్మి శివ కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాపర్తి రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ శివ కుమారి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కరుడుగట్టిన కార్యకర్తరామకృష్ణ అని పార్టీ ఏ కార్యక్రమాలు ఆదేశించిన కష్టపడి పనిచేసే తత్వం కల రామకృష్ణ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉండడంతో ప్రత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు ఆయనను కలిసి మునుపటిలాగే పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో రాపర్తి రామకృష్ణ పై వచ్చిన వార్తలు ఆ వాస్తమని చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను పార్టీ ఎప్పటికీ వదులుకోదని లక్ష్మి శివకుమారి అన్నారు. అనంతరం రాపర్తి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ తన గొంతులో ప్రాణం ఉన్నంతసేపు వదలను అని నేనిప్పుడు జగన్కు విధేయుడినినని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్సీపీ నాయకులు అంకంరెడ్డి సతీష్, చిట్టిబాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, గుమ్మరేగుల వైఎస్ఆర్సిపి నాయకులు బచ్చల తమ్మారావు, నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


