పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో ఆశ్వయుజ మాసం పౌర్ణమి సందర్భంగా మంగళవారం నాడు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు 8మంది దంపతులతో సామూహికంగా భక్తులచే శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ వ్రతాలు చేయడంతో భక్తులకు కోరిన కోరికలు మరియు వారికి దారిద్ర్యం తొలగి,అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు సిద్ధస్తాయని,విశేషంగా పుణ్య ఫలితం భక్తులకు అందుతుందని రామాలయం ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ అన్నారు.
ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు వ్రతాలు భక్తులచే నిర్వహిస్తున్నారననీ అన్నారు.భగవంతుని అనుగ్రహం సూక్ష్మ మార్గంలో పొందుటకు, దోష నివారణ జరుగుటకు తమకు తోచిన విధంగా తమ శక్త్యానుసారం , పూజలు,వ్రతాలు నిర్వహించడంతో భగవంతుని ప్రసన్నం చేసుకొని వారి ఆపదలు తొలగి, కోరికలు నెరవేర్చే విధంగా స్వామి అనుగ్రహిస్తాడనీ ఆయన తెలిపారు.ఆలయ ఆవరణలోని శివాలయంలో పరమశివుని భక్తులు దర్శించుకున్నారు. రామాలయ అన్నప్రసాద కమిటీ వారికి సామూహికంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు.నిత్య విష్ణుసహస్రనామ పారాయణ కమిటీ సభ్యులు,సాయి భక్తులు స్వామి వారిని కీర్తిస్తూ కీర్తనలు భజనలు చేశారు.భక్తులకు వేద ఆశీర్వచనం,తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.రామాలయ అన్నప్రసాద కమిటీ వారిచే ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలలో 325మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అన్న ప్రసాద కమిటీ సభ్యులు కందడై జయలక్ష్మి,కందడై శ్రీనివాస చార్యులు, కరుణశ్రీ ,అర్థం రవీందర్, టి.మల్లేష్, నందకిశోర్, రమాదేవి,రత్నమాల,శారద, నారాయణ,శివ, గొల్ల రాములు,పుల్లయ్య, బాలస్వామి,చారి, నరసింహ గౌడ్, సాయిభక్తులు,నిత్య విష్ణు సహస్ర పారాయణం కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వైభవంగా రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు….
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో ఆశ్వయుజ మాసం పౌర్ణమి సందర్భంగా మంగళవారం నాడు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు 8మంది దంపతులతో సామూహికంగా భక్తులచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వ్రతాలు చేయడంతో భక్తులకు కోరిన కోరికలు మరియు వారికి దారిద్ర్యం తొలగి,అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు సిద్ధస్తాయని,విశేషంగా పుణ్య ఫలితం భక్తులకు అందుతుందని రామాలయం ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ అన్నారు. ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు వ్రతాలు భక్తులచే నిర్వహిస్తున్నారననీ అన్నారు.భగవంతుని అనుగ్రహం సూక్ష్మ మార్గంలో పొందుటకు, దోష నివారణ జరుగుటకు తమకు తోచిన విధంగా తమ శక్త్యానుసారం , పూజలు,వ్రతాలు నిర్వహించడంతో భగవంతుని ప్రసన్నం చేసుకొని వారి ఆపదలు తొలగి, కోరికలు నెరవేర్చే విధంగా స్వామి అనుగ్రహిస్తాడనీ ఆయన తెలిపారు.ఆలయ ఆవరణలోని శివాలయంలో పరమశివుని భక్తులు దర్శించుకున్నారు. రామాలయ అన్నప్రసాద కమిటీ వారికి సామూహికంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు.నిత్య విష్ణుసహస్రనామ పారాయణ కమిటీ సభ్యులు,సాయి భక్తులు స్వామి వారిని కీర్తిస్తూ కీర్తనలు భజనలు చేశారు.భక్తులకు వేద ఆశీర్వచనం,తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.రామాలయ అన్నప్రసాద కమిటీ వారిచే ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలలో 325మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అన్న ప్రసాద కమిటీ సభ్యులు కందడై జయలక్ష్మి,కందడై శ్రీనివాస చార్యులు, కరుణశ్రీ ,అర్థం రవీందర్, టి.మల్లేష్, నందకిశోర్, రమాదేవి,రత్నమాల,శారద, నారాయణ,శివ, గొల్ల రాములు,పుల్లయ్య, బాలస్వామి,చారి, నరసింహ గౌడ్, సాయిభక్తులు,నిత్య విష్ణు సహస్ర పారాయణం కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

