చిట్వేలి ఆగస్టు పున్నమి ప్రతినిధి
చిట్వేల్ మండలానికి చెందిన క్లాస్–1 కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ ముక్క రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.


