*వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా డేవిడ్ రాజు*
* *ఎమ్మెల్యే వాసుపల్లికి కృతజ్ఞతలు తెలిపిన 37వార్డు వైసీపీ శ్రేణులు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
కష్టపడే వారికి గుర్తించే ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా
రేయి డేవిడ్ రాజు ఆసీలమెట్ట కార్యాలయంలో శనివారం వాసుపల్లి ని కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ డేవిడ్ రాజు వైఎస్ఆర్సిపి పార్టీలో ఎనలేని కృషిచేసారన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్ లో 37వార్డులో
చెన్నా జానకిరామ్ తో కలిసి ఆయన విజయానికి తన వంతు కృషి చేశారన్నారు. నిస్వార్ధంగా పార్టీలో పని చేసే వారికి పదవులు వస్తాయన్నారు. అధిష్టానం క్షేత్రస్థాయి నుండి పరిశీలన చేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం ప్రజలతో ఉండి వారి పక్షాన ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. పేదల పాలిట ఆపద్బాంధవుడు, వాసుపల్లి గణేష్ కుమార్ సహకారంతో అధిష్టానం గుర్తించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని డేవిడ్ రాజు వెల్లడించారు. వచ్చే ఎన్నికలలో వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లా SC సెల్ ఉపాధ్యక్షుడు మరియు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, జిల్లా సెక్రెటరీ & 37వ ఇంచార్జ్ గనగల రామరాజు, 37వ వార్డ్ ప్రెసిడెంట్ ఆకుల యేసు, 30 వార్డ్ ప్రెసిడెంట్ మాణిక్యాలరావు, వార్డ్ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


