Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

వేములపాడులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి గ్రామస్తుల చేరిక!

Punnami Newsroom Published:
వేములపాడులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి గ్రామస్తుల చేరిక!

ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం వేములపాడు పంచాయతీలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల వేళ వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.
జలదంకి మండల టీడీపీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, సొసైటీ చైర్మన్ అపలనాయుడు, వేముల బ్రహ్మేశ్వరరావు, చంద్రగిరి రఘురామయ్య, వేముల చిన్న వెంకటకృష్ణ సమక్షంలో పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
వేములపాడు పంచాయతీలో చోటుచేసుకున్న ఈ చేరికలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వేములపాడులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి గ్రామస్తుల చేరిక!

వేములపాడులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి గ్రామస్తుల చేరిక!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *