Story highlights
- ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..
- రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు బాగుంటుంది: డీఎస్ రెడ్యా నాయక్ చింతపల్లి, అక్టోబర్ 29 (పున్నమి): మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల వెంకన్న ఇటీవల వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకోగా, గురువారం ఆయన స్వగృహానికి వెళ్లి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డీఎస్…
- వెంకన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.. రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు బాగుంటుంది: డీఎస్ రెడ్యా నాయక్
చింతపల్లి, అక్టోబర్ 29 (పున్నమి):
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల వెంకన్న ఇటీవల వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకోగా, గురువారం ఆయన స్వగృహానికి వెళ్లి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డీఎస్ రెడ్యా నాయక్ పరామర్శించారు. వెంకన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనలు పాటిస్తూ, తగిన విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా డీఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమని, ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని వెంకన్నకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తిరిగి సాధారణ జీవనంలోకి రావాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికొకరు అండగా నిలుస్తూ కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో సమష్టి కృషితో గట్టి పోటీ ఇచ్చేలా ఇప్పటి నుంచే ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగాలని ధైర్యాన్ని నింపినట్లు తెలిసింది.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య, బొజ్జ నాయక్, పెద్ది వెంకన్న, ఎర్ర బాలాజీ, బికోజి, శ్రీశైలం, నరహరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్
News Sources
- Punnami ReportingOwn reporting