గోపాలపురం, తేదీ: 30.10.2025
వెంకటాయపాలెం గ్రామంలోని మునిగిన పొలాలను ఆర్డీవో రాణి సుస్మిత పరిశీలన
గురువారం సాయంత్రం కొవ్వూరు ఆర్డీవో శ రాణి సుస్మిత గోపాలపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో తుఫాను కారణంగా మునిగిన వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్టాలను అంచనా వేయడం జరుగుతోందని ఆర్డీవో తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపరిహారం కోసం అవసరమైన నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించబడతాయని పేర్కొన్నారు.
సందర్శనలో వ్యవసాయ శాఖ అధికారులు, తహసిల్దార్, సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.


