చిట్వేల్ ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
విద్యార్థులు తమ చదువుతోపాటు వృత్తి విద్య కోర్సు నందు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్ నందు నూతనంగా వృత్తి విద్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు మహమ్మద్ రఫీ ని టీచర్ గా నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ టీచర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, వృత్తి విద్యా కోర్స్ నందు ఆహార పదార్థాల తయారీ విధానం అనే యూనిట్ ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సాధారణ చదువుతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఈ కోర్సుల నందు విద్యార్థులకు ఉన్న నైపుణ్యం ద్వారా ఉన్నత కోర్సులు చేసుకోవడం సులభం అవుతుందని అన్నారు. ఈరోజు విద్యార్థులకు ఫుడ్ ప్రాసెసింగ్ టీచర్ మహమ్మద్ రఫీ “ఫ్రూట్ ట్రిపుల్ ఫుడింగ్” అనే ఆహార పదార్థాన్ని తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు నేర్పించడం జరిగింది. అలాగే విద్యార్థుల చేత స్వయంగా తయారు చేయించడం జరిగింది.
ప్రభుత్వం పాఠశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు సంబంధించి రిఫ్రిజిరేటర్, మైక్రో ఓవెన్, ఇండక్షన్ స్టవ్, ఫ్రూట్ మిక్సర్, మిక్సీ, కేక్ తయారీ పాత్రలు మొదలైన సామాగ్రిని పాఠశాలకు అందివ్వడం జరిగింది.
ఇప్పటికే పాఠశాలలో వృత్తి విద్యా కోర్సులైన ప్రథమ చికిత్స విభాగం, ఎలక్ట్రానిక్స్ విభాగం, ఐటీ విభాగం కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు తెలిపారు. ప్రభుత్వం కల్పించే ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని, అలాగే చుట్టుపక్కల ప్రజలు చదువుతోపాటు ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా టీచర్లైన మహమ్మద్ రఫీ చినబాబు, నాగమణి పాటు పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సుహాసిని, తెలుగు ఉపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్ మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.


