గూడూరు @ 26 డిసెంబరు
ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘వీర్ బల్ దివస్’ ను పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో వీర్ బల్ దివస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, గణిత శాస్త్ర అధ్యాపకురాలు మరియు ఇంచార్జి ప్రిన్సిపాల్ కిరణ్మయి, అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ పీర్ కుమార్ తదితరులు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9, 2022న సాహస బాలల (పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు సాహిబ్‌జాదా జోరావర్ సింగ్ మరియు సాహిబ్‌జాదా ఫతే సింగ్) స్మారకార్థం డిసెంబర్ 26ను ‘ వీర్ బాల్ దివస్గా’ ప్రకటించారని, అప్పటినుండి ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 26న వీర్ బల్ దివస్‌ను జరుపుకుంటున్నామని, చిన్న వయస్సులోనే వారు ప్రదర్శించిన అచంచలమైన అసాధారణ ధైర్యం, విశ్వాసం మరియు ధర్మం పట్ల నిబద్ధతను, వారి త్యాగాన్ని గౌరవించటానికి మరియు నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నామని, విద్యార్థినీ విద్యార్థులు మానవత్వ విలువలు పెంపొందించుకుని ధర్మబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి జాతీయస్థాయిలో 20 మందికి పురస్కారాలు ప్రకటించిందని, ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు అనే ఆరు విభాగాల్లో సృజనాత్మకత చూపించిన వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందిస్తారని, అవార్డులు పొందిన వారి సాహసాలు, విజ్ఞానం దేశానికి గర్వకారణం గా భావించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లక్ష్మీ హిమబిందు, శ్రీలత, ఉష, రమేష్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

వీర్ బల్ దివస్‌ను శ్రద్ధాసక్తులతో జరుపుకున్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
గూడూరు @ 26 డిసెంబరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘వీర్ బల్ దివస్’ ను పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో వీర్ బల్ దివస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, గణిత శాస్త్ర అధ్యాపకురాలు మరియు ఇంచార్జి ప్రిన్సిపాల్ కిరణ్మయి, అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ పీర్ కుమార్ తదితరులు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9, 2022న సాహస బాలల (పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు సాహిబ్‌జాదా జోరావర్ సింగ్ మరియు సాహిబ్‌జాదా ఫతే సింగ్) స్మారకార్థం డిసెంబర్ 26ను ‘ వీర్ బాల్ దివస్గా’ ప్రకటించారని, అప్పటినుండి ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 26న వీర్ బల్ దివస్‌ను జరుపుకుంటున్నామని, చిన్న వయస్సులోనే వారు ప్రదర్శించిన అచంచలమైన అసాధారణ ధైర్యం, విశ్వాసం మరియు ధర్మం పట్ల నిబద్ధతను, వారి త్యాగాన్ని గౌరవించటానికి మరియు నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నామని, విద్యార్థినీ విద్యార్థులు మానవత్వ విలువలు పెంపొందించుకుని ధర్మబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి జాతీయస్థాయిలో 20 మందికి పురస్కారాలు ప్రకటించిందని, ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు అనే ఆరు విభాగాల్లో సృజనాత్మకత చూపించిన వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందిస్తారని, అవార్డులు పొందిన వారి సాహసాలు, విజ్ఞానం దేశానికి గర్వకారణం గా భావించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లక్ష్మీ హిమబిందు, శ్రీలత, ఉష, రమేష్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

