సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ :
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. ప్లాంటు ప్రైవేటీకరించే ప్రణాళిక ఏదీ లేదని, కర్మాగారం పునరుద్ధరణ కోసం కేంద్రం రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని గుర్తుచేశారు. ప్లాంట్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, త్వరలోనే ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
వాస్తవాలను తెలుసుకోకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు.


