విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
విశాఖ స్టీల్ ఆర్టీసీ డిపోని యధావిధిగా కొనసాగించాలని
విశాఖ జిల్లా కలెక్టర్ ఎం ఎస్ నరేందర ప్రసాద్ ని విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మంగళవారం కలిసి కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు ఉక్కునగరంలో ఉన్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు విద్యార్థులు సిటీకి వెళ్లడానికి అదేవిధంగా అగనంపూడి , వడ్లపూడి, పెదగంట్యాడ, గంగవరం ఉక్కు నిర్వాసితులు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనంగా ఉన్న కూర్మన్నపాలెం విశాఖ స్టీల్ ఆర్టీసీ డిపో ని స్టీల్ ప్లాంట్ ఇచ్చిన 8 ఎకరాల్లో స్థలములో డిపో ని స్థాపించి 33 సంవత్సరాలు ఒక రూపాయి లీజుపై ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు లీజు అయిపోయినది తొలగించాలని లేకపోతే లీజు కొనసాగించుటకు 138 కోట్ల రూపాయలు కట్టాలని స్టీల్ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నదనీ, స్టీల్ ప్లాంట్ ఇచ్చిన స్థలము 8 ఎకరాలకి ప్రత్యామ్యంగా అగనంపూడి స్టీల్ ప్లాంట్ గోడకి ప్రక్కన ఉన్న 8 ఎకరాలు స్థలము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి, గతంలో గంగవరం పోర్టుకు స్టీల్ ప్లాంట్ వద్ద 1500 వందల ఎకరాలు తీసుకొని ప్రత్యమానంగా రాష్ట్ర ప్రభుత్వం కే కోటపాడు, మాకవరపాలెం, రేపాక ప్రాంతాల్లో 1500 ఎకరాలు స్థలము స్టీల్ ప్లాంట్ కు కి ఇవ్వడం జరిగినది, ఎంతో అభివృద్ధి చెందుతున్న గాజువాక నియోజకవర్గంలో విశాఖ స్టీల్ ఆర్టీసీ డిపో ని ఉంచవలసిన అవసరం ఎంతో ఉందని. కావున ఆర్టీసీ డిపో ని యధావిదంగా కొనసాగించుటకు తగు చర్యలు తీసుకోవాలని వినత పత్రము అందజేయడం జరిగినది. విశాఖ జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

