— పున్నమి ప్రతినిధి
మంగళవారం విశాఖపట్నంలో భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ, ఫీల్డింగ్ లోపాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఐదు కీలక క్యాచ్‌లను చేజార్చడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేసినట్లు సమాచారం. సిరీస్‌లో పట్టు సాధించాలంటే బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుగ్గా రాణించాలని టీమిండియా భావిస్తోంది.


