Wednesday, 25 March 2026
  • Home  
  • విశాఖ నౌకాదళంలో తెలంగాణ గవర్నర్ పర్యటన… INS హిమగిరి, ఖండేరీ పరిశీలన
- విశాఖపట్నం

విశాఖ నౌకాదళంలో తెలంగాణ గవర్నర్ పర్యటన… INS హిమగిరి, ఖండేరీ పరిశీలన

విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి) తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విశాఖపట్నంలో తూర్పు నావిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నౌకాదళంలో కీలక పాత్ర పోషిస్తున్న INS హిమగిరితో పాటు, స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన కల్వరి క్లాస్ జలాంతర్గామి INS ఖండేరీని ఆయన పరిశీలించారు. భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా జరుగుతున్న ప్రగతికి ఈ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. నౌకాదళ సిబ్బంది పనితీరును ఆయన అభినందిస్తూ, దేశ భద్రతకు వారి సేవలు అమూల్యమని ప్రశంసించారు.

విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి)

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విశాఖపట్నంలో తూర్పు నావిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నౌకాదళంలో కీలక పాత్ర పోషిస్తున్న INS హిమగిరితో పాటు, స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన కల్వరి క్లాస్ జలాంతర్గామి INS ఖండేరీని ఆయన పరిశీలించారు.
భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా జరుగుతున్న ప్రగతికి ఈ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. నౌకాదళ సిబ్బంది పనితీరును ఆయన అభినందిస్తూ, దేశ భద్రతకు వారి సేవలు అమూల్యమని ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.