విశాఖపట్నం , సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
విశాఖ నగర పోలీసు కమిషనర్ Dr. శంఖబ్రత భాగ్చి, ఐ.పీ.ఎస్., ప్రారంభించిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రం సేవలకు గుర్తింపుగా విశాఖ సిటీ పోలీస్‌కు ఢిల్లీలో 20-09-2025న నిర్వహించిన 102వ స్కోచ్ అవార్డుల కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. హిట్ అండ్ రన్ ఘటనలలో బాధితులకు ప్రభుత్వ పరిహారం అందించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, ఫారమ్‌లు, సహకార సేవలు అందిస్తూ ఇప్పటివరకు రూ.63.50 లక్షల పరిహారం అందజేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 7995095793 ద్వారా సేవలు అందుతున్న ఈ కేంద్రానికి నగర ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.


