
విశాఖపట్నం, అక్టోబర్ 3:
విశాఖపట్నం సిటీ పోలీసులు దేశవ్యాప్తంగా నేరాలకెక్కిన బవేరియా గ్యాంగ్ ప్రధాన సభ్యుడు ధర్మేంద్ర కుమార్ (34)ను అరెస్ట్ చేశారు. అతడి అరెస్టుతో 9 చైన్ స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించారు.
పోలీసుల ప్రకారం, నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. దేశంలోని జమ్మూ & కాశ్మీర్, ఢిల్లీ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కలిపి 24 కేసులు అతడి పై నమోదయ్యాయి. వీటిలో 147, 148, 149, 307, 392, 379, 394, 411 వంటి IPC సెక్షన్లు ఉన్నాయి.
వైజాగ్‌లో నేరాలు (17-09-2025):
7 చైన్ స్నాచింగ్‌లు – 1టౌన్, కంచరపాలెం, షీలానగర్ పరిధిలో
2 బైక్ దొంగతనాలు – 1టౌన్, ఎంఆర్పేట ప్రాంతాల్లో
పోలీసుల ఆపరేషన్:
వెస్ట్ ఇన్స్పెక్టర్ మీసాల చంద్ర మౌళి, కంచరపాలెం ఎస్‌ఐ షైక్ అబ్దుల్ మారూఫ్ నేతృత్వంలోని టీమ్ నిందితుడితో మమేకమై ట్రాప్ వేసి పట్టుకున్నారు. అతడి వద్ద నుండి నగదు, బంగారు ఆభరణాలు, దొంగిలించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలకు హెచ్చరిక:
విలువైన ఆభరణాలు బహిరంగంగా ధరించకుండా జాగ్రత్త పడాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నెంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

