విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చెందిన 2500 ఎకరాల భూమిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలనే ప్రతి పాదనలు చంద్ర బాబు కూటమి ప్రభుత్వం ఉపసంహరించాలి.
సిపిఐ (ఎం) విశాఖ జిల్లా కమిటీ డిమాండ్
*విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (విజజర్) పేర క్రీడాకుళం నుండి కాకినాడ జిల్లాల వరకు మొత్తం 9 జిల్లాల పరిధిలో (ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల పెట్టుబడుల కొరకు 232 పేజీలతో కూడిన ఒక ప్రణాళికను ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విడుదల వేసింది. ఇందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చెందిన సుమారు 2500 ఎకరాల భూమిని (ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రతిపాదనలు చేయబడ్డాయి. కుట్రపూరిత వ్యూహంతో చంద్రబాబు ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు రూ.2400 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలను అడ్డం పెట్టుకొని ఈక్విటీగా మార్చుకొని అందుకు పరిహారంగా ప్లాంట్ భూములను తమ వశం చేసుకునేందుకు కన్నేసి నట్లు తెలుస్తున్నది. తక్షణం ఈ దుర్మార్గ ప్రతి పాదనను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయాలని, అలాగే స్టీల్ ప్లాంట్ భూములు ప్లాంట్ విస్తరణకు మాత్రమే ఉపయోగించాలని సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 1100 ఎకరాల భూమిని ఎన్.ఎం.డీ.సి ముడి సరుకుల నిల్వల యార్డు కొరకు 33 ఏళు పాటు లీజుకు తీసుకుంది. ఇప్పటి వరకు ఈ భూమిలో యార్డ్ నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉంచింది. దీనిని ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అదానీకి ధారాదత్తం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే స్టీల్ ప్లాంట్ యొక్క భూములు సుమారు 3500 ఎకరాలకు పైగా అదానీ, మిట్టల్ వంటి కార్పొరేట్ సంస్థల పరమయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది.”
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. పైకి ప్లాంట్ ను కాపాడుతాం అంటూనే దీనిని చావు దెబ్బ తీస్తున్నారు. గత ఏడాది కాలంలో నైపుణ్యత కలిగిన సుమారు 6 వేల మంది నిర్వాసిత మరియు కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించారు. విఆర్ఎస్ పేర 1700 మందికి పైగా పర్మినెంట్ కార్మికులను తొలగించారు. ఇపుడు మూడో సారి వి.ఆర్.ఎస్ నోటిఫికేషన్ ఇచ్చారు. నేడు తనకు అనుకూలంగా ఉన్న ఇతర రాష్ట్రాల నుండి వలస కార్మికులను తెచ్చిపెట్టుకుంటున్నారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించకుండా తీవ్ర ద్రోహం చేస్తున్నారు.
ప్లాంట్ లో కోక్, సింటర్ ప్లాంట్ అవసరానికి తగ్గట్టు తయారు చేయకుండా బయటనుండి అదనంగా టన్ను కోకక్కు రూ.8 వేలు, సింటర్ ప్లాంట్ పెల్లెట్స్ కు రూ. 2వేలకు పైగా ఖర్చుచేసి రప్పించారు. వందలకోట్ల కమీషన్లకు పాల్పడ్డారు. ఫలితంగా ఉత్పత్తిలో రా మెటీరియల్ ఖర్చు 60 నుండి 78 శాతానికి పెంచేశారు. దీంతో ఉత్పత్తి భారీగా పెరిగినా ప్లాంట్ నష్టాలు బారిన పడుతున్నది. గడిచిన 9నెలల్లో రూ.780 కోట్లు పైబడి నష్టాలు వచ్చాయి. యంత్రాలు మరమ్మత్తులు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. ఈ వైఫల్యానికి కార్మికులమీద ప్రభుత్వం, యాజమాన్యం నెట్టబడుతోంది. బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నిర్వాహకంపల్ల ఈ నష్టాలు చవిచూసాయి.
నరేంద్ర మోడీ – చంద్ర బాబు పవన్ కళ్యాణ్ కూటమి చర్యలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరింత నష్టాలు పాలుజేసేలా ఉ న్నాయి. కుట్ర పూరిత వ్యూహంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపటానికి చంద్రబాబు నాయుడు తరచూ విశాఖ స్టీల్ ప్లాంట్ పైనా, అందులో పనిచేసే కార్మికులపై విష ప్రచారం చేస్తున్నారు. అంతిమంగా ప్లాంట్ ను మిట్టల్, అదానీ వంటి కార్పొరేట్ లకు ధారాదత్తం చేసేందుకు వేగంగా పావులు కలుపుతున్నారు…
(నమ్మి రమణ)
సిఐటియు నాయకులు
(ఎన్.రామారావు)
సిఐటియు సీనియర్ నాయకులు
(డా॥ బి.గంగారావు)
78వవార్డు కార్పొరేటర్
(కె.లోకనాధం)
కేంద్రకమిటీ సభ్యులు


