*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
మన విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ (AI) ఆధారిత రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ను అమలుపరిచి విశాఖపట్నం నగర పరిధిలో ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహించుటకు గాను దేశం లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలను గతంలో ఆహ్వానించడం జరిగింది. సదరు కంపెనీలు ఇదివరకు పలుమార్లు గౌరవ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ M. భారత్ గారు, విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చీ IPS, విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ M.N.హరేంధిర ప్రసాద్ IAS మరియు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమీషనర్ శ్రీ కేతన్ గార్గ్ IAS గార్ల ముందు వారి వారి ప్రెజెంటేషన్ లను ఇవ్వడం జరిగింది. ఈ రోజు అనగా తే.24-10-2025 ది నాడు విశాఖపట్నం కలెక్టర్ వారి కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ క్రింది అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది.
నగరంలోని ముఖ్యమైన 101 ట్రాఫిక్ కూడళ్ళలో మరియు మరికొన్ని ముఖ్యమైన కూడళ్ళలో అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ (ATCS) విస్తరణ ద్వారా ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం, నగర పౌరులకు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడం మరియు పౌరుల ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టమ్స్ ద్వారా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం (రైడర్ & పిలియన్ రైడర్), ట్రిపుల్ రైడింగ్, రెడ్ లైట్ ఉల్లంఘన, ప్రామాణికం కాని నంబర్ ప్లేట్లు / నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగించడం, వ్యతిరేఖ మార్గంలో డ్రైవింగ్ చేయడం, వేర్వేరు వాహనాలకు ఒకే నంబర్ ప్లేట్‌ను ఉపయోగించడం, అనధికార పార్కింగ్ మొదలగు ట్రాఫిక్ ఉల్లంఘలను కనిపెట్టి ట్రాఫిక్ చలానాలను ఆటోమేటిక్ గా జారీ చేయడం జరుగుతుంది. నగరంలోని ముఖ్యమైన రహదారులలో మరియు నిర్మానుష్య రహదారులలో అతివేగంగా, రేసింగ్ మరియు స్టంట్స్ చేస్తూ వాహనం ను నడుపుతున్న వాహనాలను గుర్తించి ఆటోమేటిక్ గా ట్రాఫిక్ చలానాలను జారీ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాహనం పై పెండింగ్ ఉన్న చలాన్ల సంఖ్యను గుర్తించి వాహన యజమానికి అప్రమత్తం చేయడం జరుగుతుంది.
నగరంలోని ముఖ్యమైన 25 ప్రదేశాలలో మరియు మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ (AI) ఆధారిత కెమెరాలను అమర్చి ముఖ ఆధారిత గుర్తింపు (FACIAL RECOGNITION) అను కొత్త సాంకేతికతను నగరంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సాంకేతికత ద్వారా నేర చరిత్ర గల వ్యక్తులు, అనుమానితులను, రియల్ టైం లో నగరంలో సంచరించినప్పుడు గుర్తించి, పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని వెంటనే చేరవేయడం జరుగుతుంది.
ప్రయాణ సమయాలను తగ్గించడానికి ట్రాఫిక్సిగ్నలింగ్ వ్యవస్థలో synchronization ను తీసుకురావడం జరుగుతుంది.
VVIP/VIP/అత్యవసర ట్రాఫిక్ నిర్వహణను సులభతరం చేయడానికి 3 గ్రీన్ కారిడార్లను (1) నగరంలోని జాతీయ రహదారి, (2) రైల్వే స్టేషన్ రోడ్ (3) బాజీ జంక్షన్ BRTS రోడ్ నుండి పెందుర్తి వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
పై అంశాలపై GVMC అధికారుల సహాయంతో 05 సంవత్సరాల కాలపరిమితికి గాను విధివిధానాలను (Request for proposals – RFP) రూపొందించి టెండర్స్ ను ఆహ్వానించుట కొరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొత్తం గా విశాఖపట్నం ట్రాఫిక్ సిస్టమ్ ను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా సరికొత్తగా నవీకరించడం జరుగుతుంది.

