విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు; వార్డు, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విశాఖ టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగింది. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం. శ్రీభరత్ గారు, శాసన మండలి ప్రభుత్వ విప్ డా.వేపాడ చిరంజీవిరావు గారు కమిటీల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వచ్చే స్థానిక సంస్థలలో విజయకేతనం ఎగురవేసే దిశగా నూతన కమిటీలు కృషి చేయాలని కోరారు. అధిక సంఖ్యలో ఉత్తర నియోజకవర్గ టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు;