సుండుపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
సుండుపల్లి మండలంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక స్వామి మండపాలను విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, వినాయక మండపాల ఏర్పాటుకు పోలీస్, విద్యుత్ శాఖల అనుమతి కోసం 182 ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని గురువారం సూచించారు. మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సంఘటనలు జరిగితే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు.


