అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం నూతక్కివారి కండ్రిక పంచాయతీ గాలిపాలెం గ్రామానికి చెందిన మర్రి తిరుపతి కుమారుడు మర్రి శీనయ్య (26) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. తెలుగుగంగ కాలువ రెగ్యులేటర్ వద్ద మోటార్ రిపేర్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. శీనయ్య మోటార్ రిపేరు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందినవాడు. అతని ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


