రైల్వేకోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
రైల్వేకోడూరులో గురువారం సిపిఎం, సిపిఐ, వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద స్మార్ట్ మీటర్లు, ట్రూ ఆప్ చార్జీలు, విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించాలని నిరసన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కదిలించిన చలో అసెంబ్లీ విద్యుత్ ఉద్యమానికి ఆగస్టు 28, 2000 నాటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య పేర్కొన్నారు.


