ABVP ఆధ్వర్యంలో మంచిర్యాల లో ప్రెస్ మీట్…
విద్యారంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు అన్నారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంచిర్యాల కేంద్రంలో సెప్టెంబర్ 18 19 తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థి నాయకులు పాల్గొని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించడం జరిగింది అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగిందని ఇందులో రాష్ట్ర స్థితి విద్యారంగ స్థితిపై రెండు తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరిగిందని ఈ తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని అన్నారు
రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాఫ్ అయ్యారని అన్నారు. విద్యార్థులకు హక్కుగా రావాల్సిన స్కాలర్షిప్ లో రియంబర్స్మెంట్ ను విడుదల చేయకుండా విద్యార్థుల్లోకాన్ని మానసిక వేదన గురి చేస్తున్నారని సర్టిఫికెట్లు తీసుకోలేక ఉన్నత చదువులకు పోలేక విద్యార్థులు రోడ్డు ఎక్కుతుంటే బారిపైన అక్రమ కేసులు బనాయించి జైల్లో పంపించే కార్యక్రమం పెడుతున్నారని అన్నారు.ఈ రాష్ట్రం లోపల రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్ కే పిలుపునివ్వడం.రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అన్నారు ఈ మధ్యకాలంలో కొన్ని పృథ్విద్యా కళాశాలలో నిర్భయ పిలుపునిస్తున్నామని చెప్పి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ చర్చలు సఫలమయ్యాయని బందు ను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన చేయడం జరిగింది. కావున ఇకనుండి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఫీజుల కోసం వేధించి సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీల అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రం లోపల పేద పిల్లలు చదువుకునే గురుకుల సంక్షేమ హాస్టల్లో పరిస్థితి దారుణంగా తయారయిందని ఫుడ్ పాయిజన్ తో చనిపోతున్నారని సరైన బడ్జెట్ లేక పక్కా భవనాలు లేక గురుకులాల అల్లాడుతున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో వెంటనే జాతీయ విద్యా విధానం (NEP 2020) ని అమలు పరచాలని అర్బన్ నక్సలైట్లతో కమ్యూనిస్టు భావజాలంతో నిండి ఉన్న విద్యా కమిషన్ దీన్ని అడ్డుకోవాలని చూస్తే విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీలను బడ్జెట్ కి సరిపడా బ్లాక్ గ్రాండ్ కేటాయించకుండా పాలక మండలాన్ని నియమించకుండా కావాలనే నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన ఇప్పటివరకు యూనివర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను రిక్రూట్ చేయకపోవడం దారుణమని ప్రైవేట్ యూనివర్సిటీల కంటే దారుణంగా ప్రభుత్వ యూనివర్సిటీ విద్యార్థులను ముక్కు పిండి వసూలు చేయడానికి ఎబివిపి ఖండిస్తున్నామని అన్నారు.ఈ రాష్ట్రంలో రైతాంగం యొక్క దుస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్య లా తయారు అయిందని వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని దోక చేస్తుందని అన్నారు .ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు ఒకవైపు రైతులు యూరియా కోసం కొట్లాడుతుంటే నిరుద్యోగులు మీరు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల మాటేమిటని రోడ్లెక్కుతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూసిన తప్పిస్తే ఏ యొక్క వర్గానికి న్యాయం చేయడం ఈ రాష్ట్రంలో అక్రమాలకు వేదికైనను బట్టి టీజీపీఎస్ అని వెంటనే రద్దు చేయాలని దాని స్థానంలో కొత్త బోర్డును నియమించి వెంటనే గ్రూప్ వన్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల మాఫియా ఈ రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయని విద్యార్థుల నుండి నిబంధన విరుద్ధంగా ఫీజులు దండుకుంటూ విద్యార్థులను నానా హింసలు పెడుతున్నాయని డ్రగ్స్ కు గంజాయికి వేదికగా మారిన ప్రైవేటు యూనివర్సిటీలపై ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు విద్యార్థి సమాజానికి చెప్పాలన్నారు ఈ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పై పూర్తిగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయకపోవడం మూలంగా పర్యవేక్షణ కరువై విద్యా ప్రమాణాలు పడిపోయి విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్లలో చేరడం ఆపేసారన్న స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు విద్యారంగానికి అధిక నీళ్లు కేటాయించి విద్యారంగాన్ని దాడిలో పెట్టాలని విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టాలన్నారు లేకపోతే విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని సాయంత్రం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్, విభాగ్ కన్వీనర్ అజయ్ ,జిల్లా కన్వీనర్ అనిల్ పాల్గొన్నారు


