Thursday, 5 February 2026
  • Home  
  • విద్యార్ధుల ఆత్మహత్యలన్నీ వ్యవస్థాగత హత్యలే
- ఆంధ్రప్రదేశ్

విద్యార్ధుల ఆత్మహత్యలన్నీ వ్యవస్థాగత హత్యలే

పిడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను అధ్యక్షతన జరిగిన సెమినార్ లో ప్రధాన వక్తగా విచ్చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తెలుగు ఆచార్యులు పిల్లి వాసు గారు మాట్లాడుతూ “ఎన్సీఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో) నివేదికల ప్రకారం 2024లో 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిలో 2,248 మంది పరీక్షల్లో ఫెయిల్ అయిన కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, సాధారణ ఆత్మహత్యల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు 2 శాతం అధికంగా నమోదు అయిందని పేర్కొంది. ఆనందంగా, నవ్వుతూ, తుళ్ళుతూ, స్వేచ్ఛగా, ఇష్టంగా చదువు నేర్చుకుని, సమాజానికి, దేశానికి సరికొత్త ఆవిష్కరణలు అందించాల్సిన విద్యార్థులు మార్కులు, ర్యాంకుల కోసం జరుగుతున్న పోటీలో నిలబడలేక, అవమానాలను తట్టుకోలేక, బయటకు చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. సమాజాన్ని తీర్చిదిద్ది, దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన విద్యార్థి, యువతరం పాల్పడుతున్న ఆత్మహత్యలను వ్యవస్థీకృత హత్యలుగా భావించి, వాటికి గల మూల కారణాలను పరిష్కరించుకోవాలన్నారు.పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్ మాట్లాడుతూ “విద్యను అత్యంత ఖరీదైన సరుకుగా మార్చి,కార్పొరేట్, విదేశీ శక్తులకు అప్పజెప్పుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థుల్లో కుల,మత, ప్రాంతీయ విద్వేషాలను పెంచే విధంగా పాఠ్యాంశాలను మారుస్తున్నారు. దీంతో విద్యార్థులు అధైర్యంగా, అనైతికంగా, ఎటువంటి విలువలు లేకుండా దేశం పట్ల, సమాజం పట్ల, కనీసం తమ సమస్యల పట్ల కూడా స్పందించలేని స్థితిలోకి నెట్టవేయబడుతున్నారు. మరోవైపు ఉద్యోగాలు కల్పించకుండా విద్యార్థుల మధ్య సంక్లిష్టమైన పోటీని సృష్టిస్తున్నారు. ఈ పోటీలో నెగ్గడం కోసం విద్యార్థులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా బట్టీపట్టి చదువుతూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా విద్యార్థులు పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెబుతూ ప్రభుత్వాలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయన్నారు.ఏపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు నేతాజీ గారు మాట్లాడుతూ “పిల్లల ఊహాశక్తికి రెక్కలు తొడిగి, సృజనాత్మకతను వెలికి తీసి ఆవిష్కరణలు సృష్టించేందుకు విద్యా బోధనలో అనేక ప్రయోగాలను చేస్తున్న, ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను బోధిస్తున్న ఫిన్లాండ్ ను మన దేశం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రాపంచిక విషయాలు, సామాజిక స్పృహను కలిగిన ఆచరణాత్మకతతో కూడిన, పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించాలన్నారు. అలాగే విద్యలో శారీరక శ్రమకు, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.అప్పుడే విద్యార్థుల ఆత్మహత్యలను నియంత్రించగలమన్నారుఈ కార్యక్రమంలో PDSO రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్.మోహన్, జిల్లా కమిటీ సభ్యులు మరియు వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

“నేటి విద్యా విధానం - విద్యార్థుల ఆత్మహత్యలు” అనే అంశంపై ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో సెమినార్ ను గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది.

పిడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను అధ్యక్షతన జరిగిన సెమినార్ లో ప్రధాన వక్తగా విచ్చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తెలుగు ఆచార్యులు పిల్లి వాసు గారు మాట్లాడుతూ “ఎన్సీఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో) నివేదికల ప్రకారం 2024లో 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిలో 2,248 మంది పరీక్షల్లో ఫెయిల్ అయిన కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, సాధారణ ఆత్మహత్యల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు 2 శాతం అధికంగా నమోదు అయిందని పేర్కొంది. ఆనందంగా, నవ్వుతూ, తుళ్ళుతూ, స్వేచ్ఛగా, ఇష్టంగా చదువు నేర్చుకుని, సమాజానికి, దేశానికి సరికొత్త ఆవిష్కరణలు అందించాల్సిన విద్యార్థులు మార్కులు, ర్యాంకుల కోసం జరుగుతున్న పోటీలో నిలబడలేక, అవమానాలను తట్టుకోలేక, బయటకు చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. సమాజాన్ని తీర్చిదిద్ది, దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన విద్యార్థి, యువతరం పాల్పడుతున్న ఆత్మహత్యలను వ్యవస్థీకృత హత్యలుగా భావించి, వాటికి గల మూల కారణాలను పరిష్కరించుకోవాలన్నారు.
పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్ మాట్లాడుతూ “విద్యను అత్యంత ఖరీదైన సరుకుగా మార్చి,కార్పొరేట్, విదేశీ శక్తులకు అప్పజెప్పుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థుల్లో కుల,మత, ప్రాంతీయ విద్వేషాలను పెంచే విధంగా పాఠ్యాంశాలను మారుస్తున్నారు. దీంతో విద్యార్థులు అధైర్యంగా, అనైతికంగా, ఎటువంటి విలువలు లేకుండా దేశం పట్ల, సమాజం పట్ల, కనీసం తమ సమస్యల పట్ల కూడా స్పందించలేని స్థితిలోకి నెట్టవేయబడుతున్నారు. మరోవైపు ఉద్యోగాలు కల్పించకుండా విద్యార్థుల మధ్య సంక్లిష్టమైన పోటీని సృష్టిస్తున్నారు. ఈ పోటీలో నెగ్గడం కోసం విద్యార్థులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా బట్టీపట్టి చదువుతూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా విద్యార్థులు పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెబుతూ ప్రభుత్వాలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయన్నారు.
ఏపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు నేతాజీ గారు మాట్లాడుతూ “పిల్లల ఊహాశక్తికి రెక్కలు తొడిగి, సృజనాత్మకతను వెలికి తీసి ఆవిష్కరణలు సృష్టించేందుకు విద్యా బోధనలో అనేక ప్రయోగాలను చేస్తున్న, ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను బోధిస్తున్న ఫిన్లాండ్ ను మన దేశం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రాపంచిక విషయాలు, సామాజిక స్పృహను కలిగిన ఆచరణాత్మకతతో కూడిన, పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించాలన్నారు. అలాగే విద్యలో శారీరక శ్రమకు, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.అప్పుడే విద్యార్థుల ఆత్మహత్యలను నియంత్రించగలమన్నారు
ఈ కార్యక్రమంలో PDSO రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్.మోహన్, జిల్లా కమిటీ సభ్యులు మరియు వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.