విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి
— డాక్టర్ కందుల నాగరాజు
*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-*
మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆకాంక్షించారు.
విశాఖ రైల్వే స్కూల్లో నిర్వహించిన
మెగా పేరెంట్, టీచర్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్స్ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ
విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
సమాజ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటు వినయం, విధేయత, సంస్కారం, మానవతా విలువలను కూడా నేర్పించాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి విధ్యనభ్యసించి తమ తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసు కురావాలన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని,
క్రీడల్లో రాణించడం వల్ల విద్య ఉద్యోగాల్లో
వారికి మొదటి ప్రాధాన్యం లభిస్తుందన్నారు.
తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశలో విద్యార్థులు క్రమశిక్షణ తో ఉజ్వల భవిష్యత్తు ఏర్పరుచుకోవాలని అన్నారు.
విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ వై. మీనాక్షి
అలాగే బి.రామారావు, ఏబి మాణిక్యం, ఎం ఆర్ వి నర్సమ్మ, టి పద్మజ, పి సుధా, ఎస్ ఆర్ తులసి, ఏఎస్ రాజా, ఎన్ పవన్ కుమార్ కె.సాయి విమల కుమారి, ఎస్ కే మదీనా, బి.శివ ప్రసాద్, ఈ.మేరీ సుశీల ,
జి.ఆనంద్, సిహెచ్ ఝాన్సీ,
కె .రామారావు ,ఆర్ ఏ ప్రసన్న, టి.జయ, ఏ.మణి, డి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


