జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ
కామారెడ్డి, జనవరి ( పున్నమి ప్రతినిధి ) :
టీనేజ్ వయసులో మానసిక ఒత్తిడి, మాదక ద్రవ్యా లు, సోషల్ మీడియా మోహం వల్ల భవిష్య త్తు వృధా చేసుకోకండి. ప్రణాళికాబద్ధ చదువు, కుటుం బ సహకారంతో లక్ష్యాలు సాధించండి అని జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ సూచించారు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలోని బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం మానసిక సమ స్యలు, పరీక్షా కాలంలో విద్యార్థుల వ్యవహారం, మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్ర మం జరిగింది.
టీనేజ్ వయసు.. మానసిక దృఢత్వం కీలకం
విద్యార్థులను ఉద్దేశించి డా.రమణ మాట్లాడుతూ, మానసికంగా దృఢంగా ఉండాలని, టీనేజ్ వయసు లో వచ్చే మానసిక అవరోధాలను అధిగమించాల ని సూచించారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధ్యమని తెలిపారు. వయసు రీత్యా ఆకర్షణలకు లొంగి చదువుపై దృష్టి పోగొట్టుకుని చెడు వ్యసనా లకు లోనవ్వకూడదని హెచ్చరించారు.
పరీక్షలు.. ఒత్తిడి కాకుండా ప్రణాళిక
పరీక్షా కాలంలో ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వాల ని, మానసిక ఒత్తిడి పెట్టుకోకూడదని పీఎచ్సీ డా . సురేష్ అన్నారు. మొబైల్‌ను కేవలం కమ్యూనికేష న్ కోసమే వాడాలని, సోషల్ మీడియా మోజులో పడి బంగారు భవిష్యత్తు కోల్పోకూడదని స్పష్టం చేశారు.
మాదక ద్రవ్యాలు.. యువత బాధ్యత
టీనేజీలు మత్తుపదార్థాలకు లోనై తమ విలువైన జీవితాలు వృధా చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో అన్నయ్యలు, కుటుంబ సభ్యులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు వివరించాలని కోరారు. కుటుంబం, సమాజాన్ని కాపాడటం యువత బాధ్యత అని, మాదక నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.తల్లిదండ్రుల కలలు సాకారం చేయండిఅని అన్నారు.ఉన్నత లక్ష్యాలు చేరుకుని తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని, చదువు సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను సంప్రదించా లని సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే తనను సంప్రదించాలని విద్యార్థులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మోహ న్, MLHP డా. రమ్యశ్రీ, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


