*విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి*
మహదేవపూర్, జులై 25, పున్నమి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కళాశాల ప్రిన్సిపల్ ఎన్. నర్సయ్య శుక్రవారం భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు కు వినతిపత్రం సమర్పించారు.
ప్రతి దినం కాలేశ్వరం నుండి వచ్చే విద్యార్థులకు కళాశాలకు సమీపములో గల బోమ్మాపూర్ ఎక్స్ రోడ్ వద్ద బస్సులు ఆపాలని వారు కోరారు. దీంతోపాటు మహదేవ్ పూర్ మండలంలోని సర్వాయి పేట, పంకేన, అంబటిపల్లి, సూరారం, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం శనివారం నుండి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన డిపో మేనేజర్ ఇందు కు కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రసాద్, రమేష్,పాల్గొన్నారు.


