కాటారం, ఆగస్టు 29: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు పి. సుధాకర్,ఆధ్వర్యంలో శుక్రవారం 40 మంది విద్యార్ధిని విద్యార్ధులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.
పాఠశాల ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ రాధ, ఎం. శ్రీనివాస్, పి. కుమార్, ఏ. రవీందర్, జి. వియేందర్, సాజిదా బేగం, ఎం. చైతన్య, బి. వెంకటరమణ, డి. శ్రీధరచార్యులు విరాళాలతో విద్యార్థి, విద్యార్థినులకు క్రీడా దుస్తులు అందజేశారు. అంతే కాకుండా పాఠశాలకు కావాల్సిన సౌకర్యాల కల్పనలో తమ సహాయ సహకారాలు అందజేయనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ రాధ మాట్లాడుతూ… విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె సూచించారు.


