భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం వ్యవసాయం.
కానీ రైతు కష్టానికి మాత్రం మార్కెట్లో విలువ రావడం లేదు.
విత్తనం కొనడం నుంచి పంట ఇంటికి వచ్చే వరకు
ఆరు పాలెం శ్రమ, చెమటతో పంట పెంచే వ్యవసాయదారుడు
పంట వస్తుందా రాదా అనే భయంతోనే రోజులు గడుపుతున్నాడు.
ఇప్పుడిక పంటను మార్కెట్‌కు తీసుకెళ్లినా
సీసీఐ ద్వారా అమ్మాలంటే కపాస్ కిసాన్ మొబైల్ యాప్ తప్పనిసరి.
కానీ అందరు రైతులు చదువుకున్నవారు కారు,
స్మార్ట్‌ఫోన్ లేదా ఆన్లైన్ అవగాహన కూడా లేదు.
దీంతో అపాయింట్మెంట్లు, తేదీలు, తిప్పలు,
తరువాత పంట అమ్మినా… డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదు.
జై జవాన్ – జై కిసాన్ అని గొప్పగా చెప్పుకున్నా,
నిజానికి జవాన్ దేశాన్ని రక్షిస్తే – కిసాన్ దేశాన్ని పోషిస్తున్నాడు.
అయితే పంట పండించేవాడే
అతిపెద్ద ఆర్థిక ఒత్తిడిలో జీవించాల్సి వస్తోంది.
నెలల తరబడి శ్రమించి పండించిన పంటకు
డబ్బులు వచ్చేదెప్పుడు?
అనే ప్రశ్నకు సమాధానం కోసం రైతు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు.
✊ రైతు బతికితేనే దేశం బతుకుతుంది
✊ రైతుకు న్యాయం కావాలి


