Story highlights
- విజ్ఞానంతోనే వికసించు జగత్తు -------------------------------- --- లింగాల ఘణపురం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్-2026 స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగాల ఘణపురం నందు లింగాల ఘణపురం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు -విద్యార్థుల్లో సైన్స్ పట్ల ప్రావీణ్యతను పెంచడానికి,…
- మండల స్థాయిలో ప్రతిభ చూపిన ఆయా విభాగాలలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని,విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు.
- ఈ కార్యక్రమంలో లింగాల ఘణపురం మండల విద్యాధికారి అయిత నరసింహులు మాట్లాడుతూ నిత్య జీవితంలో మానవులకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, వాటిని సైన్స్ పద్ధతిలో పరిష్కరించినపుడే ప్రగతి సాధ్యమని పాఠశాల స్థాయి నుంచే ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల అభివృద్ధి అధికారి శివశంకర్ రెడ్డి…
విజ్ఞానంతోనే వికసించు జగత్తు
——————————– —
లింగాల ఘణపురం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్-2026
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగాల ఘణపురం నందు లింగాల ఘణపురం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు -విద్యార్థుల్లో సైన్స్ పట్ల ప్రావీణ్యతను పెంచడానికి, సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి, సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి, శాస్త్రీయ ఆలోచనలను పరిశీలనాశక్తిని అందించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి,సైన్స్ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి మరియు సమస్యలను పరిష్కరించే సంస్కృతిని భావి భారత శాస్త్రవేత్తలు ఎదగడానికి తోడ్పడే విధంగా జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ కు మండల కన్వీనర్ బండోజు శ్రీనివాస చారి అధ్యక్షత వహించడం జరిగింది. మండల స్థాయిలో ప్రతిభ చూపిన ఆయా విభాగాలలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని,విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాల ఘణపురం మండల విద్యాధికారి అయిత నరసింహులు మాట్లాడుతూ నిత్య జీవితంలో మానవులకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, వాటిని సైన్స్ పద్ధతిలో పరిష్కరించినపుడే ప్రగతి సాధ్యమని పాఠశాల స్థాయి నుంచే ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల అభివృద్ధి అధికారి శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని బావిభారత పౌరులుగా ఎదగాలని,భవిష్యత్తులో చాలా నూతన ఆవిష్కరణలు జరగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవాబుపేటకు చెందిన తువేరియా, ఆర్ కార్తీక్, పి రేవతి, ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం విభాగంలో PVR పాఠశాలకు చెందిన పెండేల అక్షర, బండారి సాత్విక, గడ్డం జాయిష్, గురుకులాల విభాగంలో ఆదర్శ పాఠశాల లింగాల గణపురంకు చెందిన ఎం రవళిక, ఓ అక్షయ్, కె ఓం ప్రకాష్ లు ప్రథమ స్థానాల్లో నిలిచి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు 28న జనగామలో జరిగే జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ కి హాజరవుతారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను,బుక్స్ లను బహుమతిగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు, లింగాల ఘణపురం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు బిల్ల విద్యా రాణి, నెల్లుట్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బానోతు రవీందర్, గ్రామ సర్పంచ్ ఎడ్ల లావణ్య, వార్డు సభ్యులు కుంటి భీమయ్య,ఉపాధ్యాయులు యస్ సబిత,దొంతుల కమలాకర్, మహమ్మద్ ఖాసిం, వలబోజు సత్యనారాయణ, సంతోష్ రెడ్డి, యం పద్మ ,టి శివ ప్రసాద్, పెంటారెడ్డి మర్రెడ్డి, యస్ శ్రీలత, యల్ సుమలత, వై శ్రీనివాస్,జె ప్రమీల తదితరులు పాల్గొన్నారు.