NTR జిల్లా సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించారు ఎంపీ కేశినేని శివనాథ్. దసరా, విజయవాడ ఉత్సవాల సందర్భంగా నగరానికి వచ్చే భక్తులు, సందర్శకులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. నగరాన్ని, కృష్ణమ్మ పరవళ్ళ అందాలను ఆకాశం నుంచి చూడగల అరుదైన అవకాశం అని ఆయన తెలిపారు. ప్రజలకు వినోదం, పర్యాటక రంగానికి ప్రోత్సాహం కల్పించేందుకు, విజయవాడ ప్రతిష్టను జాతీయ స్థాయికి తీసుకెళ్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు.


