ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్య సంఘం ( సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్) ఆధ్వర్యంలో నంద్యాల,కర్నూలు జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణలో గత శని, ఆదివారాలలో నంద్యాలలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి యూరాలజీ వైద్య వైజ్ఞానిక సదస్సు విజయవంతమైందని సోమవారం సదస్సు నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి, నిర్వాహక కమిటీ కోశాధికారి డాక్టర్ జై బాబు రెడ్డి, కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ దాసరి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో 25 మంది జాతీయస్థాయిలో పేరుగాంచిన యూరాలజీ వైద్యనిపుణులు జననేంద్రియ, మూత్ర పిండాలు,మూత్రాశయం,మూత్ర నాళాలు, ప్రొస్టేట్ వ్యాధుల చికిత్సలో వచ్చిన అధునాతన మార్పులు, వినియోగంలోకి వచ్చిన అత్యంత ఆధునిక పరికరాలపై మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా యూరాలజీ వైద్యులకు అవగాహన కల్పించారని తెలిపారు. చికిత్స విధానాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్న కొన్ని వ్యాధులపై చర్చ పోస్టులు నిర్వహించారు. యూరాలజీ పి.జీ.విద్యార్థులు క్లిష్టమైన వ్యాధులకు చికిత్స విధానాలపై తమ పరిశోధన పత్రాలు సమర్పించారు.
ఢిల్లీ కి చెందిన సఫ్ధర్ జంగ్ హాస్పిటల్ యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అనూప్ కుమార్, వారణాసిలో ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీ యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సమీర్ త్రివేది, హైదరాబాద్ కు చెందిన దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్రమోహన్ వంటి ప్రముఖ నిపుణులు సదస్సులో పాల్గొనడం విశేషమని అన్నారు.
300 మంది ఉభయ తెలుగు రాష్ట్రాల కు చెందిన యూరాలజీ వైద్యులు ప్రతినిధులుగా సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. ప్రతినిధులుగా పాల్గొన్నవారికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ తరపున నిరంతర వైద్య విద్య నాలుగు పాయింట్ల సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి వైద్యుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ వైద్య రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకునే సమయంలో మొత్తం 25 నిరంతర వైద్య విద్య పాయింట్లు కలిగి ఉండాలని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ తరఫున పరిశీలకులుగా శాంతిరాం వైద్య కళాశాల రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బి.ఈ.పనిల్ కుమార్ సదస్సుకు హాజరయ్యారు.
సూపర్ స్పెషాలిటీ విభాగానికి చెందిన రాష్ట్రస్థాయి సదస్సు నంద్యాలలో నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి అని తెలిపారు.
యూరాలజీ వైద్య విభాగానికి సంబంధించిన చికిత్సలన్ని ప్రస్తుతం నంద్యాలలో అందుబాటులో ఉన్నాయని, నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చికిత్సలు చేయడానికి అవసరమైన అత్యంత ఆధునిక పరికరాలు, వసతులు ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా అనేక యూరాలజీ చికిత్సలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
నంద్యాలలో ఇంత పెద్ద వైజ్ఞానిక వైద్య సదస్సు నిర్వహించినందుకు నిర్వాహక కమిటీకి రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ లు అభినందనలు తెలిపారు.

విజయవంతమైన ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సదస్సు*
ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్య సంఘం ( సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్) ఆధ్వర్యంలో నంద్యాల,కర్నూలు జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణలో గత శని, ఆదివారాలలో నంద్యాలలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి యూరాలజీ వైద్య వైజ్ఞానిక సదస్సు విజయవంతమైందని సోమవారం సదస్సు నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి, నిర్వాహక కమిటీ కోశాధికారి డాక్టర్ జై బాబు రెడ్డి, కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ దాసరి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో 25 మంది జాతీయస్థాయిలో పేరుగాంచిన యూరాలజీ వైద్యనిపుణులు జననేంద్రియ, మూత్ర పిండాలు,మూత్రాశయం,మూత్ర నాళాలు, ప్రొస్టేట్ వ్యాధుల చికిత్సలో వచ్చిన అధునాతన మార్పులు, వినియోగంలోకి వచ్చిన అత్యంత ఆధునిక పరికరాలపై మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా యూరాలజీ వైద్యులకు అవగాహన కల్పించారని తెలిపారు. చికిత్స విధానాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్న కొన్ని వ్యాధులపై చర్చ పోస్టులు నిర్వహించారు. యూరాలజీ పి.జీ.విద్యార్థులు క్లిష్టమైన వ్యాధులకు చికిత్స విధానాలపై తమ పరిశోధన పత్రాలు సమర్పించారు. ఢిల్లీ కి చెందిన సఫ్ధర్ జంగ్ హాస్పిటల్ యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అనూప్ కుమార్, వారణాసిలో ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీ యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సమీర్ త్రివేది, హైదరాబాద్ కు చెందిన దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్రమోహన్ వంటి ప్రముఖ నిపుణులు సదస్సులో పాల్గొనడం విశేషమని అన్నారు. 300 మంది ఉభయ తెలుగు రాష్ట్రాల కు చెందిన యూరాలజీ వైద్యులు ప్రతినిధులుగా సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. ప్రతినిధులుగా పాల్గొన్నవారికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ తరపున నిరంతర వైద్య విద్య నాలుగు పాయింట్ల సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి వైద్యుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ వైద్య రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకునే సమయంలో మొత్తం 25 నిరంతర వైద్య విద్య పాయింట్లు కలిగి ఉండాలని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ తరఫున పరిశీలకులుగా శాంతిరాం వైద్య కళాశాల రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బి.ఈ.పనిల్ కుమార్ సదస్సుకు హాజరయ్యారు. సూపర్ స్పెషాలిటీ విభాగానికి చెందిన రాష్ట్రస్థాయి సదస్సు నంద్యాలలో నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి అని తెలిపారు. యూరాలజీ వైద్య విభాగానికి సంబంధించిన చికిత్సలన్ని ప్రస్తుతం నంద్యాలలో అందుబాటులో ఉన్నాయని, నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చికిత్సలు చేయడానికి అవసరమైన అత్యంత ఆధునిక పరికరాలు, వసతులు ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా అనేక యూరాలజీ చికిత్సలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. నంద్యాలలో ఇంత పెద్ద వైజ్ఞానిక వైద్య సదస్సు నిర్వహించినందుకు నిర్వాహక కమిటీకి రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ లు అభినందనలు తెలిపారు.

