Wednesday, 25 March 2026
  • Home  
  • వికలాంగుల పింఛన్లు రద్దు చేయొద్దు – సిఐటియు డిమాండ్
- అన్నమయ్య

వికలాంగుల పింఛన్లు రద్దు చేయొద్దు – సిఐటియు డిమాండ్

అన్నమయ్య జిల్లా, ఆగస్టు 23 : అర్హులైన వికలాంగుల పింఛన్లు రద్దు చేసే విధానాన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి పి. జాన్ ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల మండల కన్వీనర్ కర్రతోటి హరి నారాయణ డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు సిఐటియు ఆఫీసులో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.నిజమైన వికలాంగులకు పింఛన్లు రద్దు చేస్తూ నోటీసులు ఇవ్వడం తీవ్ర అన్యాయమని, ఎవరూ అనర్హులు కాకపోయినా నోటీసులు అందినట్లు తెలిపారు. గ్రామ సచివాలయంలోనే నిజమైన అనర్హులను గుర్తించి వారికి మాత్రమే చర్యలు తీసుకోవాలని, తప్పుడు రిపోర్టులు ఇచ్చిన వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.40 శాతం అంగవైకల్యం ఉన్నవారికి మాత్రమే కాకుండా, 30 శాతం అంగవైకల్యం కలిగిన నిరుద్యోగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని కోరారు. పింఛన్లు కేంద్రం లేదా రాష్ట్ర దయాదక్షిణాల వల్ల రాలేదని, వికలాంగుల పోరాట ఫలితమేనని గుర్తుచేశారు. దాదాపు లక్షమందికి నోటీసులు జారీ చేయడం వల్ల వికలాంగులు భయభ్రాంతులకు గురై ఆత్మహత్యల వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన వారికి పెన్షన్ కొనసాగించాలనే విషయం ప్రభుత్వానికి గుర్తు చేశారు. సెప్టెంబర్ నుండి అన్ని అర్హులైన వికలాంగులకు పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విభిన్న ప్రతిభావంతుల పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

అన్నమయ్య జిల్లా, ఆగస్టు 23 :
అర్హులైన వికలాంగుల పింఛన్లు రద్దు చేసే విధానాన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి పి. జాన్ ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల మండల కన్వీనర్ కర్రతోటి హరి నారాయణ డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు సిఐటియు ఆఫీసులో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.నిజమైన వికలాంగులకు పింఛన్లు రద్దు చేస్తూ నోటీసులు ఇవ్వడం తీవ్ర అన్యాయమని, ఎవరూ అనర్హులు కాకపోయినా నోటీసులు అందినట్లు తెలిపారు. గ్రామ సచివాలయంలోనే నిజమైన అనర్హులను గుర్తించి వారికి మాత్రమే చర్యలు తీసుకోవాలని, తప్పుడు రిపోర్టులు ఇచ్చిన వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.40 శాతం అంగవైకల్యం ఉన్నవారికి మాత్రమే కాకుండా, 30 శాతం అంగవైకల్యం కలిగిన నిరుద్యోగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని కోరారు. పింఛన్లు కేంద్రం లేదా రాష్ట్ర దయాదక్షిణాల వల్ల రాలేదని, వికలాంగుల పోరాట ఫలితమేనని గుర్తుచేశారు.
దాదాపు లక్షమందికి నోటీసులు జారీ చేయడం వల్ల వికలాంగులు భయభ్రాంతులకు గురై ఆత్మహత్యల వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన వారికి పెన్షన్ కొనసాగించాలనే విషయం ప్రభుత్వానికి గుర్తు చేశారు.
సెప్టెంబర్ నుండి అన్ని అర్హులైన వికలాంగులకు పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విభిన్న ప్రతిభావంతుల పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.