రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి న్యూస్ ప్రతినిధి
రైల్వేకోడూరు మండలం స్థానిక శ్రీ వాసవి కనికా పరమేశ్వరి బాలాలయంలో సాయంత్రం 6 గంటలకు వాసవి చేయూత పథకం ధ్వారా 11 మంది వయోవృద్దులకు 500/- చొప్పున పింఛను ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో రీజనల్ IV చైర్మన్ శ్రీ గాదంశెట్టి సుమన్ కుమార్ , డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వేమా వెంకట కిషోర్ బాబు ,వాసవి క్లబ్ రైల్వేకోడూరు అధ్యక్షులు తిరునామల సత్యనారాయణ , కోశాధికారి టంగుటూరి దశరథ , గర్రె వెంకట నరసయ్య పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

