Sunday, 7 December 2025
  • Home  
  • వాటోలి గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్‌ సేవా శిబిరం మూడవ రోజు అద్భుత కార్యక్రమాలు
- నిర్మల్

వాటోలి గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్‌ సేవా శిబిరం మూడవ రోజు అద్భుత కార్యక్రమాలు

. గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా — నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబిరం మూడవ రోజు వాటోలి గ్రామంలో ఉత్సాహంగా కొనసాగింది. విద్యార్థులు గ్రామ అభివృద్ధికి తమ సేవలను సమర్పిస్తూ రోడ్ల శుభ్రత, డ్రైనేజీ శుభ్రత, చెత్త నిర్వాహణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి ముందర ఉన్న చెత్తను సక్రమంగా తొలగించాలని ప్రజలకు చైతన్యం కల్పించడంతో పాటు, పోచమ్మ మందిరం పరిసరాల్లోని చెత్తను పూర్తిగా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు గ్రామంలో పరిశుభ్రత ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు. మధ్యాహ్నం అనంతరం “యోగా అభ్యసనం దాని యొక్క ప్రాముఖ్యత” అనే అంశంపై యోగ ఇన్స్ట్రక్టర్ శోభ మందాని మేడం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు యోగ వల్ల కలిగే శారీరక, మానసిక లాభాలను వివరించడంతో పాటు సూర్యనమస్కారాలు, బ్రామరీ, అనులోమ–విలోమ వంటి ఆసనాలను చూపించి ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య గారు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ ఆరె. రాజు గారు, అధ్యాపకులు ఓం ప్రకాష్, గుంత సుధాకర్, డా.కోసారి సంతోష్ కుమార్, డా డా.కల్పన, శ్రావణి, రాజయ్య, రామ్మోహన్, అర్షియ బేగం జి. కిషన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఎన్ఎస్ఎస్ క్యాంపు తో గ్రామం మరింత అందంగా, పరిశుభ్రంగా మారింది

.

గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా — నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబిరం మూడవ రోజు వాటోలి గ్రామంలో ఉత్సాహంగా కొనసాగింది. విద్యార్థులు గ్రామ అభివృద్ధికి తమ సేవలను సమర్పిస్తూ రోడ్ల శుభ్రత, డ్రైనేజీ శుభ్రత, చెత్త నిర్వాహణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రతి ఇంటి ముందర ఉన్న చెత్తను సక్రమంగా తొలగించాలని ప్రజలకు చైతన్యం కల్పించడంతో పాటు, పోచమ్మ మందిరం పరిసరాల్లోని చెత్తను పూర్తిగా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు గ్రామంలో పరిశుభ్రత ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు.

మధ్యాహ్నం అనంతరం “యోగా అభ్యసనం దాని యొక్క ప్రాముఖ్యత” అనే అంశంపై యోగ ఇన్స్ట్రక్టర్ శోభ మందాని మేడం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు యోగ వల్ల కలిగే శారీరక, మానసిక లాభాలను వివరించడంతో పాటు సూర్యనమస్కారాలు, బ్రామరీ, అనులోమ–విలోమ వంటి ఆసనాలను చూపించి ప్రాక్టికల్ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య గారు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ ఆరె. రాజు గారు, అధ్యాపకులు ఓం ప్రకాష్, గుంత సుధాకర్, డా.కోసారి సంతోష్ కుమార్, డా డా.కల్పన, శ్రావణి, రాజయ్య, రామ్మోహన్, అర్షియ బేగం జి. కిషన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఎన్ఎస్ఎస్ క్యాంపు తో గ్రామం మరింత అందంగా, పరిశుభ్రంగా మారింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.