రిపోర్టర్ సింగం కృష్ణ, మునుగోడు ప్రతినిధి, నారాయణపురం,వాచ్య తాండా,నవంబర్29,(పున్నమి ప్రతినిధి)
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని వాచ్యతండా సర్పంచ్ బరిలో ఉన్నారు హతీ రామ్ నాయక్,(చిన్న).ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యతను ఇస్తూ గ్రామ ప్రజలు తనను గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని ప్రజలను కోరారు.నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పత్రిక ముఖంగా ఆయన తెలియజేశారు.గ్రామంలోని సమస్యలను తీర్చడానికి కంకణ బద్రుడనై గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,ఆయన అభిమానులు,తదితరులు,పాల్గొన్నారు.


