Sunday, 7 December 2025
  • Home  
  • వరిపంట వ్యాధుల నియంత్రణకు రైతులకు సూచనలు
- ఆంధ్రప్రదేశ్

వరిపంట వ్యాధుల నియంత్రణకు రైతులకు సూచనలు

 కామారెడ్డి 17 అక్టోబర్ పున్నమి ప్రతినిధి   : వరి సీజన్‌లో పంటలను వివిధ తెగుళ్లు తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని రామారెడ్డి వ్యవసా యశాఖ అధికారి భాను శ్రీ ఒక ప్రకటనలో హెచ్చ రించారు. ముఖ్యంగా దోమపోటు, పొట్టకుళ్ళు, కాటుక పండు తెగులు, నల్ల కంకి, మెడ విరుపు వంటి వ్యాధులు ఇటీవల వర్షాలతో పెరిగిన తేమ కారణంగా విస్తరిస్తున్నాయని తెలిపారు.ఈ నేప థ్యంలో రైతులు సమయానుకూలంగా గుర్తించి సరైన మందుల పిచికారీ చేయాలని సూచించా రు.దోమపోటు పొలాల్లో పిల్ల, పెద్ద దోమలు గుంపు లుగా రసం పీలుస్తూ పంటను వలయాకారంలో ఎండిపోయేలా చేస్తాయి. నివారణకు డైనోటెఫ్యు రాన్ 0.4 గ్రా లేదా బ్యూప్రోఫేజిన్ 1.6 ml లేదా పైమెట్రోజైన్ 50WG 0.6 గ్రా లేదా ఇమిడక్లోప్రీడ్ 40% + ఎతిప్రోల్ 40% WG 0.25 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.   పొట్ట కుళ్ళు తెగులు…. పొట్టాకు నల్లటి లేదా గోధు మ మచ్చలు ఏర్పడి గింజలు తాలు పోవడం ప్రధా న లక్షణం. దీనికి ప్రోపికొనజోల్ 1 ml లేదా టేబు కోనాజోల్ + ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 75WG 0.4 గ్రా లీటరు నీటికి కలిపి చిరు పొట్ట దశలో ఒకసారి, 25% పూత దశలో మరొకసారి పిచికారీ చేయాలని సూచించారు.   కాటుక లేదా మాణి పండు తెగులు….  కంకిలో గింజలు మొదట పసుపు రంగులోకి, తరువాత నలుపు రంగులోకి మారడం గమనించ వచ్చు. నివారణకు ప్రోపికొనజోల్ 1 ml లేదా కార్బెండజిమ్ 50% WP 1 గ్రా లేదా టేబుకోనా జోల్ + ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 75WG 0.4 గ్రా లీటరు నీటికి కలిపి రెండు దఫాలుగా పిచికారీ చేయాలని సిఫార్సు చేశారు.   వరి కంకి నల్లి / నల్ల కంకి….  గింజలపై నల్ల మచ్చలు ఏర్పడి, గింజలు పాలు పోసుకోక తాలు గింజలుగా మారడం సాధారణం. దీనికి స్పైరోమెసిఫెన్ 1 ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.   మెడ విరుపు తెగులు….  ఈనిక దశలో మెడ భాగంలో నల్ల మచ్చలు ఏర్ప డతాయి. కంకికి పోషకాలు చేరక మెడ విరిగి వేలా డుతుంటుంది. నివారణకు ట్రైసైక్లోజోలు 0.6 గ్రా లేదా ఐసోప్రోతయోలిన్ 1.5 ml లేదా కాసుగ మైసిన్ 2.5 ml లీటరు నీటికి కలిపి 10–15 రోజు ల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వాతావరణాన్ని, తెగుళ్ల ఉధృతిని గమనించి సమయానుకూల చర్యలు తీసుకుంటే పంట నష్టం తగ్గించవచ్చని తెలిపారు.  

 కామారెడ్డి 17 అక్టోబర్ పున్నమి ప్రతినిధి   :

వరి సీజన్‌లో పంటలను వివిధ తెగుళ్లు తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని రామారెడ్డి వ్యవసా యశాఖ అధికారి భాను శ్రీ ఒక ప్రకటనలో హెచ్చ రించారు. ముఖ్యంగా దోమపోటు, పొట్టకుళ్ళు, కాటుక పండు తెగులు, నల్ల కంకి, మెడ విరుపు వంటి వ్యాధులు ఇటీవల వర్షాలతో పెరిగిన తేమ కారణంగా విస్తరిస్తున్నాయని తెలిపారు.ఈ నేప థ్యంలో రైతులు సమయానుకూలంగా గుర్తించి సరైన మందుల పిచికారీ చేయాలని సూచించా రు.దోమపోటు పొలాల్లో పిల్ల, పెద్ద దోమలు గుంపు లుగా రసం పీలుస్తూ పంటను వలయాకారంలో ఎండిపోయేలా చేస్తాయి. నివారణకు డైనోటెఫ్యు రాన్ 0.4 గ్రా లేదా బ్యూప్రోఫేజిన్ 1.6 ml లేదా పైమెట్రోజైన్ 50WG 0.6 గ్రా లేదా ఇమిడక్లోప్రీడ్ 40% + ఎతిప్రోల్ 40% WG 0.25 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.  

పొట్ట కుళ్ళు తెగులు….

పొట్టాకు నల్లటి లేదా గోధు మ మచ్చలు ఏర్పడి గింజలు తాలు పోవడం ప్రధా న లక్షణం. దీనికి ప్రోపికొనజోల్ 1 ml లేదా టేబు కోనాజోల్ + ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 75WG 0.4 గ్రా లీటరు నీటికి కలిపి చిరు పొట్ట దశలో ఒకసారి, 25% పూత దశలో మరొకసారి పిచికారీ చేయాలని సూచించారు.  

కాటుక లేదా మాణి పండు తెగులు….

 కంకిలో గింజలు మొదట పసుపు రంగులోకి, తరువాత నలుపు రంగులోకి మారడం గమనించ వచ్చు. నివారణకు ప్రోపికొనజోల్ 1 ml లేదా కార్బెండజిమ్ 50% WP 1 గ్రా లేదా టేబుకోనా జోల్ + ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 75WG 0.4 గ్రా లీటరు నీటికి కలిపి రెండు దఫాలుగా పిచికారీ చేయాలని సిఫార్సు చేశారు.  

వరి కంకి నల్లి / నల్ల కంకి….

 గింజలపై నల్ల మచ్చలు ఏర్పడి, గింజలు పాలు పోసుకోక తాలు గింజలుగా మారడం సాధారణం. దీనికి స్పైరోమెసిఫెన్ 1 ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.  

మెడ విరుపు తెగులు….

 ఈనిక దశలో మెడ భాగంలో నల్ల మచ్చలు ఏర్ప డతాయి. కంకికి పోషకాలు చేరక మెడ విరిగి వేలా డుతుంటుంది. నివారణకు ట్రైసైక్లోజోలు 0.6 గ్రా లేదా ఐసోప్రోతయోలిన్ 1.5 ml లేదా కాసుగ మైసిన్ 2.5 ml లీటరు నీటికి కలిపి 10–15 రోజు ల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వాతావరణాన్ని, తెగుళ్ల ఉధృతిని గమనించి సమయానుకూల చర్యలు తీసుకుంటే పంట నష్టం తగ్గించవచ్చని తెలిపారు.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.