ఇందుకూరు పేట డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి)
ఇందుకూరుపేట మండలంలోని భవిత సెంటర్‌లో జరిగిన వరల్డ్ డిజేబుల్ డే కార్యక్రమాన్ని గౌరవ ఏపీసీ గారు, జిల్లా IE కోఆర్డినేటర్ పొట్లూరు ప్రసాద్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి అధికారి ప్రశంసలు తెలిపారు. అనంతరం కొత్తూరు హైస్కూల్‌ను సందర్శించి PM Shri స్కూల్‌లోని కెమిస్ట్రీ ల్యాబ్ పనితీరును సమీక్షించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి బోధన ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, ప్రయోగశాల వినియోగంపై కీలక సూచనలు, సలహాలు అందించారు.


