Tuesday, 24 March 2026
  • Home  
  • వందేమాతరం గీతానికి 150 ఏళ్లు –
- విశాఖపట్నం

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు –

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు – విశాఖ వుడా హెల్త్ ఎరినా లో ఘన సామూహిక ఆలాపన 🇮🇳 *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం వుడా హెల్త్ ఎరినా ప్రాంగణంలో, వందేమాతరం గీతం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఘనంగా సామూహిక ఆలాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రజా గాయకుడు, సామాజిక కార్యకర్త మజ్జి దేవిశ్రీ సమక్షంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు దేశభక్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. “వందేమాతరం… వందేమాతరం…” నినాదాలతో వేదిక నిండిపోయింది. ఈ సందర్భంగా మజ్జి దేవిశ్రీ మాట్లాడుతూ — ఆ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణ, నేటి తరానికి గౌరవభావానికి నాంది,” అని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి KSR బ్యాడ్మింటన్ అకాడమీ సభ్యులు విశేష కృషి చేశారు. అందులో కలిదిండి సుందర రామరాజు, జి.ఎస్.ఎన్. రాజు, మురళి ప్రభాకర్, మజ్జి దేవిశ్రీ, కనక రాజు, కృష్ణం రాజు, విప్పర్ల స్వరూప్ కుమార్, వెంకటేశ్వరరావు (శోభన్ బాబు), బద్రినాధ్, బాబు రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు – విశాఖ వుడా హెల్త్ ఎరినా లో ఘన సామూహిక ఆలాపన 🇮🇳
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
విశాఖపట్నం వుడా హెల్త్ ఎరినా ప్రాంగణంలో, వందేమాతరం గీతం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఘనంగా సామూహిక ఆలాపన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రజా గాయకుడు, సామాజిక కార్యకర్త మజ్జి దేవిశ్రీ సమక్షంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు దేశభక్తి ఉత్సాహంతో పాల్గొన్నారు.
“వందేమాతరం… వందేమాతరం…” నినాదాలతో వేదిక నిండిపోయింది.

ఈ సందర్భంగా మజ్జి దేవిశ్రీ మాట్లాడుతూ —
ఆ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణ, నేటి తరానికి గౌరవభావానికి నాంది,” అని అన్నారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి KSR బ్యాడ్మింటన్ అకాడమీ సభ్యులు విశేష కృషి చేశారు.
అందులో కలిదిండి సుందర రామరాజు, జి.ఎస్.ఎన్. రాజు, మురళి ప్రభాకర్, మజ్జి దేవిశ్రీ, కనక రాజు, కృష్ణం రాజు, విప్పర్ల స్వరూప్ కుమార్, వెంకటేశ్వరరావు (శోభన్ బాబు), బద్రినాధ్, బాబు రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.