సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @కడపజిల్లా
అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కోరుతూ … మంత్రి లోకేష్‌కు ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీదేవి వినతిపత్రం సమర్పించారు. మంగళవారం సీకే దీన్నే మండలంలో ఐటి, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన అంగన్వాడీ నాయకురాలు లక్ష్మీదేవి అంగన్వాడి కేంద్రాలలో పనిచేస్తున్న కార్యకర్తలకు, ఆయాలకు జీతాలు పెంచాలని కోరి వినతిపత్రాన్నిచ్చారు. అనంతరం లక్ష్మీదేవి మాట్లాడుతూ …. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని, కనీస వేతనం అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి లోకేష్ … ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రూరల్ ప్రాజెక్టు అధ్యక్ష, ప్రధాన కారదర్శులు నాగలక్ష్మి, అరుణ, మండల నాయకులు శాంతమ్మ, ప్యారి జాన్ పాల్గొన్నారు.

లోకేష్‌కు అంగన్వాడీల వినతి – మంత్రి హామీ
సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @కడపజిల్లా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కోరుతూ … మంత్రి లోకేష్‌కు ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీదేవి వినతిపత్రం సమర్పించారు. మంగళవారం సీకే దీన్నే మండలంలో ఐటి, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన అంగన్వాడీ నాయకురాలు లక్ష్మీదేవి అంగన్వాడి కేంద్రాలలో పనిచేస్తున్న కార్యకర్తలకు, ఆయాలకు జీతాలు పెంచాలని కోరి వినతిపత్రాన్నిచ్చారు. అనంతరం లక్ష్మీదేవి మాట్లాడుతూ …. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని, కనీస వేతనం అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి లోకేష్ … ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రూరల్ ప్రాజెక్టు అధ్యక్ష, ప్రధాన కారదర్శులు నాగలక్ష్మి, అరుణ, మండల నాయకులు శాంతమ్మ, ప్యారి జాన్ పాల్గొన్నారు.

