విపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 6, 7, 8 తేదీలలో నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో జరగబోయే లక్ష దీపోత్సవ మహోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు హాజరై గుంజ ప్రతిష్ట చేసి అంకురార్పణ నిర్వహించారు.
లక్ష దీపోత్సవం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఈ మహోత్సవాన్ని లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు కంచర్ల భాస్కర్ శర్మ, ఆమంచర్ల ప్రభాకర్, విజయసారధి, సునీల్ మరియు వారి మిత్ర బృందం నేతృత్వంలో విస్తృతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతీ ఇంటిలో భక్తి దీపం వెలిగేలా, సమాజంలో శాంతి, ఐక్యత, ఆధ్యాత్మికత ప్రసరించేందుకు ఈ దీపోత్సవం ఒక ప్రేరణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

లక్ష దీపోత్సవానికి విపీఆర్ దంపతుల అంకురార్పణ
విపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 6, 7, 8 తేదీలలో నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో జరగబోయే లక్ష దీపోత్సవ మహోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు హాజరై గుంజ ప్రతిష్ట చేసి అంకురార్పణ నిర్వహించారు. లక్ష దీపోత్సవం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవాన్ని లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు కంచర్ల భాస్కర్ శర్మ, ఆమంచర్ల ప్రభాకర్, విజయసారధి, సునీల్ మరియు వారి మిత్ర బృందం నేతృత్వంలో విస్తృతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో భక్తి దీపం వెలిగేలా, సమాజంలో శాంతి, ఐక్యత, ఆధ్యాత్మికత ప్రసరించేందుకు ఈ దీపోత్సవం ఒక ప్రేరణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

