పున్నమి ప్రతినిధి నిర్మల్
లక్ష్మణచందా మండలానికి చెందిన 18 గ్రామ పంచాయతీల 613 మంది లబ్ధిదారులకు మండల కేంద్రంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి అవసరం ఉందని, ఇంకా రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు, ఆర్డీవో రత్నా కళ్యాణి గారు, ఎమ్మార్వో, ఎంపీడీవో, నాయకులు రావుల రాంనాథ్ , మండల అధ్యక్షులు చిన్నయ్య, నాయకులు అడ్వాల రమేష్, జీవన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఓస రాజు, సురేష్, రాజేశ్వర్, పోషెట్టి, రవి, చంద్రమోహన్ రెడ్డి, రాజు కుమార్, గంగాధర్, ప్రవీణ్, వడ్డే శ్రీను, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


