సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి )
సీతారామపురం మండలంలోని గుండుపల్లి గ్రామం మీదుగా వెళ్లిన 167 బి జాతీయ రహదారి పనుల బాధ్యులు గుండుపల్లె గ్రామానికి జరిగిన నష్ట నివారణ చర్యలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుండుపల్లె గ్రామస్తులు గురువారం 167 బి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండుపల్లె గ్రామం మీదుగా 167 బి జాతీయ రహదారి వెళ్లి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని అయితే నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు గుండుపల్లె గ్రామంలోకి సర్వీసు రోడ్డు ను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు గ్రామంలోకి రాకపోకలు జరపడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అదేవిధంగా గుండుపల్లి గ్రామంలోని వీధులలో ప్రవహిస్తున్న మురుగునీటి కాలువపై జాతీయ రహదారి నిర్మాణ పనులు జరిపారని మురుగు కాలువ ను మళ్లించి మరొక కాలువకు కలిపి మురుగునీటిని గ్రామం బయటకి వెళ్లేలా చర్యలు చేపడతామని చెప్పి పంట పొలాలలోకి మురుగునీరు వెళ్లేలా కాలువలను ఏర్పాటు చేశారని అందువల్ల మురుగు నీరు పొలాల్లోకి చేరడంతో పంటలు పండించేందుకు అనుకూలంగా లేదని వాపోతున్నారు. పొలాలలోకి వెళ్లేందుకు సైతం దారిని కల్పించకుండా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుండుపల్లి గ్రామ ప్రజల సమస్యలను పట్టించుకోని గుండుపల్లి గ్రామంలోకి సర్వీస్ రోడ్డు, మురుగు నీటిని పంట పొలాల్లోకి కాకుండా బయటకు వెళ్లేలా కాలువలను నిర్మించాలని, అదేవిధంగా పొలాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి నుండి పొలాల్లోకి వెళ్లేందుకు దారిని కల్పించాలని గ్రామస్తులు రైతులు కోరుతున్నారు.


