నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
ఈ ఖరీఫ్ లో రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తెలిపారు. రైస్ మిల్లర్లు ఎలాంటి జాప్యం లేకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలని కోరారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం గూడూరులోని రామకృష్ణ రైస్ మిల్లు ను తనిఖీ చేసి, మిల్లింగ్ కెపాసిటీ, బ్యాంకు గ్యారంటీ, బాయిల్డ్ రైస్ ప్రక్రియ, తదితర అంశాలపై రైసుమిల్లుల యజమానులతో మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 1,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 290 కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని,దేవరకొండ ప్రాంతాల్లో మరికొన్ని కేంద్రాలను ప్రారంభించాల్సి ఉందని, అయితే అక్కడ పంట కొంత ఆలస్యంగా వస్తుందని సాధ్యమైనంత త్వరగా అక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

రైస్ మిల్లర్లు ఎలాంటి జాప్యం లేకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలన్నా : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ఈ ఖరీఫ్ లో రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తెలిపారు. రైస్ మిల్లర్లు ఎలాంటి జాప్యం లేకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలని కోరారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం గూడూరులోని రామకృష్ణ రైస్ మిల్లు ను తనిఖీ చేసి, మిల్లింగ్ కెపాసిటీ, బ్యాంకు గ్యారంటీ, బాయిల్డ్ రైస్ ప్రక్రియ, తదితర అంశాలపై రైసుమిల్లుల యజమానులతో మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 1,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 290 కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని,దేవరకొండ ప్రాంతాల్లో మరికొన్ని కేంద్రాలను ప్రారంభించాల్సి ఉందని, అయితే అక్కడ పంట కొంత ఆలస్యంగా వస్తుందని సాధ్యమైనంత త్వరగా అక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

