Thursday, 5 February 2026
  • Home  
  • రైల్వే కోడూరు నియోజకవర్గంలో రూ.7.52 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనుల ప్రారంభం
- అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గంలో రూ.7.52 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనుల ప్రారంభం

ఓబులవారిపల్లి, ఆగస్టు 13: పున్నమి ప్రతినిధి ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు గ్రామంలో రూ.7.52 కోట్ల వ్యయంతో నిర్మించిన తారు రహదారి పనులను రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గౌ. శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సి.కె. రోడ్డునుంచి తుమ్మకొండవడ్డిపల్లి, కాకర్లవారిపల్లి, పెద్దఓరంపాడు, చిన్నఓరంపాడు మీదుగా సి.ఆర్.ఎ. రోడ్డువరకు రహదారి నిర్మాణం చేపట్టబడుతోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.752.55 లక్షలు. ఈ సందర్భంగా రూపానంద రెడ్డి గారు మాట్లాడుతూ, “ఈ రహదారి నిర్మాణం వల్ల గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడింది. పల్లెప్రజలకు సులభమైన రాకపోకలు కలుగుతాయి. మరిన్ని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందించడానికి కృషి చేస్తాము” అని అన్నారు. స్థానిక గ్రామస్థులు రహదారి నిర్మాణంపై ఆనందం వ్యక్తం చేసి, ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, NDA కూటమి నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఓబులవారిపల్లి, ఆగస్టు 13: పున్నమి ప్రతినిధి

ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు గ్రామంలో రూ.7.52 కోట్ల వ్యయంతో నిర్మించిన తారు రహదారి పనులను రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గౌ. శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సి.కె. రోడ్డునుంచి తుమ్మకొండవడ్డిపల్లి, కాకర్లవారిపల్లి, పెద్దఓరంపాడు, చిన్నఓరంపాడు మీదుగా సి.ఆర్.ఎ. రోడ్డువరకు రహదారి నిర్మాణం చేపట్టబడుతోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.752.55 లక్షలు.

ఈ సందర్భంగా రూపానంద రెడ్డి గారు మాట్లాడుతూ, “ఈ రహదారి నిర్మాణం వల్ల గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడింది. పల్లెప్రజలకు సులభమైన రాకపోకలు కలుగుతాయి. మరిన్ని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందించడానికి కృషి చేస్తాము” అని అన్నారు.

స్థానిక గ్రామస్థులు రహదారి నిర్మాణంపై ఆనందం వ్యక్తం చేసి, ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, NDA కూటమి నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.