పున్నమి ప్రతినిధి:
రైల్వేలో 2,570 ఉద్యోగాలు.. అక్టోబర్‌లో దరఖాస్తులు ప్రారంభం
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు 2,570 ఖాళీలను భర్తీ చేయనుంది. అక్టోబర్ 31న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, IT లేదా సంబంధిత రంగంలో డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి. CMA పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ నేపథ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు అర్హులు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. పూర్తి వివరాలకు RRB అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


